అల్లు అర్జున్ అప్‌కమింగ్ మూవీ అల వైకుంఠపురములో చిత్రంపై ఎన్ని అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో నిలిచిన పందెం కోళ్లలో అల వైకుంఠపురములో కూడా ఒకటంటే సందేహమే లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డె జంటగా నటించారు. అల వైకుంఠపురములో సినిమాకు ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్ అదుర్స్. ఆడియో పరంగా అల వైకుంఠపురములో పాటలు అన్ని రికార్డులను బద్దలు కొడుతూ అత్యంత ప్రజాధరణ పొందాయి. అభిమానులకు సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాను హారికా అండ్ హారిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మించారు. విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలో సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో భాగంగా గత సోమవారం హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని పోలీసు గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ తరహాలో మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఈవెంట్ అయితే బ్రహ్మాండంగా సక్సెస్ అయింది కానీ... తాజాగా ఈ కార్యక్రమంపైనే పోలీసులు కన్నెర్ర చేసినట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఈ కార్యక్రమం నిర్వహణలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన శ్రేయాస్ మీడియా, హారికా హాసిని క్రియేషన్స్ చిత్ర నిర్మాణ సంస్థ నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంటూ జూబ్లీహిల్స్ పోలీసులు ఓ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. తమ వద్ద తీసుకున్న అనుమతి ప్రకారం రాత్రి 10 గంటల వరకే మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించాలని... అది కూడా 6,000 మంది ఆహ్వానితులనే లోపలికి అనుమతించాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. అయితే, రాత్రి 11.30 గంటల వరకు ఈవెంట్ నిర్వహించిన నిర్వాహకులు... దాదాపు అనుమతించిన ఆడియెన్స్ కంటే రెండు రెట్లు ఎక్కువ జనాన్ని లోపలికి అనుమతించారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదే విషయమై జూబ్లీహిల్స్ పోలీసులు శ్రేయాస్ మీడియా ఎండి శ్రీనివాస్, హారికా హాసిని క్రియేషన్స్ చిత్ర నిర్మాణ సంస్థ మేనేజర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు సమాచారం.


ఈ పోలీసు కేసు సంగతి ఎలా ఉన్నా... అల వైకుంఠపురములో ట్రైలర్ మాత్రం ఆడియెన్స్‌లో అంచనాలు పెంచుతూ కోటి 13 లక్షల వ్యూస్ సంఖ్య దాటి దూసుకుపోతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..