Currency Nagar Telugu Movie Trailer: యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ కీలక పాత్రల్లో వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కరెన్సీ నగర్. ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్‌పై ముక్కాముల అప్పారావు, డా కోడూరు గోపాల కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆంథాలజీ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 29న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. తాజాగా ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ఆంథాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న మొట్టమొదటి తెలుగు సినిమా అని అన్నారు. ట్రైలర్ చాలా బాగుందని.. అందరూ చక్కగా యాక్ట్ చేశారని అభినందించారు. ఈ చిత్రంతో డైరెక్టర్ వెన్నెల కుమార్ మంచి విజయం అందుకుని.. గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. అనంతరం చిత్ర బృందానికి ఆల్‌ ద బెస్ట్ చెప్పారు.


కరెన్సీ నగర్ మూవీలో మనిషికి, డబ్బుకు.. నైతికతకు ఉండే బంధాన్ని, నాలుగు కథల రూపంలో చక్కగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సాంగ్స్, మ్యూజిక్ ఆకట్టుకుందని మూవీ యూనిట్ తెలిపింది. ఉత్కంఠభరితమైన కథనం, ఊహించని ట్విస్టులు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయని పేర్కొంది. అన్నివర్గాల ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని.. డిసెంబర్ 29న తప్పకుండా సినిమాను థియేటర్లలో చూడాలని మేకర్స్ కోరారు. సంగీతం సిద్ధార్థ్ సదాశివుని, పవన్ అందించగా.. ఎడిటర్‌గా కార్తిక్ కట్స్ వ్యవహరించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సతీష్ రాజబోయిన నిర్వర్తించారు.


Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..


Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి