హైదరాబాద్: కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోన్న తరుణంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విధంగా ఐస్ క్రీం ల రూపంలో ఉత్పత్తులు తయారీపై దేశంలో ప్రధాన డైరీ సంస్థలు ద్రుష్టి పెట్టాయి. భారతదేశంలో టాప్ 10 ఐస్ క్రీం బ్రాండ్, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, పాండిచ్చేరిల్లో విస్తృతమైన ఉనికి కలిగిన డెయిరీ డే, రోగనిరోధకశక్తిని పెంపొందించే దినుసులు కలిగిన ఐస్ క్రీంల ప్రత్యేక శ్రేణిని, డెయిరీ డే ప్లస్ గా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. డెయిరీ డే ప్లస్ శ్రేణి ఐస్ క్రీం రూపాంతరాల్లో డెయిరీ డే లో వుండే మంచిగుణాలన్నీ వుంటూనే, వాటితోపాటు, ఈ కాలానికి అవసరమైనట్టుగా, రోగనిరోధకశక్తిని పెంపొందించేవిగా రుజువైన ప్రత్యేక దినుసులతో తయారు చేయనున్నట్టు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: TS inter results 2020: తెలంగాణ ఇంటర్ 2020 ఫలితాలు వచ్చేశాయోచ్


అంతేకాకుండా డెయిరీ డే ప్లస్ శ్రేణిలో మొదటగా రెండు కొత్త రుచులు, హల్దీ (పసుపు) ఐస్ క్రీం, చ్యవన్ వినియోగదారులు ఆరోగ్యకరమైన, రోగనిరోధకశక్తి పెంపొందించే ఉత్పత్తులని కోరుకోడంతో, ఆహార పరిశ్రమలో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డెయిరీ డే ప్లస్ శ్రేణి ఐస్ క్రీంలు ఈ కొత్తగా వస్తున్న ఈ శైలిని అందుకుని, సురక్షితమైన, పరిశ్రమైన పద్ధతిలో, అసామాన్యమైన రుచులతో ఉత్పత్తుల్ని అందిస్తుందని, డెయిరీ డే వారి ఉత్పత్తులన్నీకూడా, కర్నాటకలోని డెయిరీ డే వారి అధునానత కేంద్రంలో ఆవిష్కరించి, అభివృద్ధిచేసి, ఉత్పత్తి చేస్తున్నవే. హల్దీ (పసుపు) ఐస్ క్రీంలో రోగనిరోధకతని పెంపొందించే మూడు ప్రధాన దినుసులైన - పసుపు, మిరియాలు, తేనె - వుంటాయని పేర్కొన్నారు. 


Also Read: ఇక ఇంటికే మొబైల్ కరోనా ల్యాబ్..


మరోవైపు  ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలు రోగనిరోధకశక్తిని పొందడానికి, పెంచుకోడానికి ఉత్పత్తుల శ్రేణికి, రోగనిరోధకశక్తిని పెంపొందించేవిగా వివిధ దినుసులతో కొత్తగా రెండు ఉత్పత్తులని జతచేస్తున్నామని ఆయా సంస్థలు వెల్లడించాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..