హైదరాబాద్: దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ కరోనా పరీక్షలు చేసేందుకు ఈ మొబైల్ టెస్టింగ్ సెంటర్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, తొలి మొబైల్ కరోనా పరీక్షల వాహనాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. వీటి ద్వారా రోజు 25 ఆర్టీ పీసీఆర్ టెస్టులు, 300 ఎలీసా టెస్టులు చేయడమే కాకుండా, హెచ్ఐవీ, టీబీ పరీక్షలు కూడా చేసే వీలుందని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో భారత్ లో కరోనాతో పోరాటం మొదలైందని, అప్పుడు దేశంలో ఒకే ఒక్క కరోనా పరీక్షల కేంద్రం ఉందని, ఇప్పుడు దేశవ్యాప్తంగా 953 ఉన్నాయని మంత్రి వెల్లడించారు. అందులో 699 ప్రభుత్వ ల్యాబ్ లేనని వెల్లడించారు.
Also Read: TS inter results 2020: తెలంగాణ ఇంటర్ 2020 ఫలితాలు వచ్చేశాయోచ్
ఇదిలా ఉంటే కరోనా వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటివరకు ఏకంగా 45 మంది పోలీసులు మరణించారని, రాష్ట్ర వ్యాప్తంగా 3820 మంది పోలీసులకు కరోనా వైరస్ సోకిందని హోం శాఖ మంత్రి డా. అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఇందులో 2754 మంది కోలుకున్నారని, 45 మంది పోలీసులు మరణించారని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరు లక్షలకుపైగా మందిని క్వారంటైన్ చేశామని, 122 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం నడుతున్నదని చెప్పారు. ఇతర రాష్ర్టాలకు చెందిన 4,138 మంది కార్మికులకు ఆశ్రయం కల్పించామని తెలిపారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 1,16,752కు చేరింది. రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి 5,651 మంది మరణించారని పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..