New Update on Dalitha Bandhu Scheme 2nd Phase: దళిత బంధు పథకం.. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం దళిత కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ దళిత బంధు పథకానికి సంబంధించిన రెండో విడతపై తెలంగాణ సర్కార్ దళితులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం రెండో విడత అమలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ సీఎంఓ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందుగానే చెప్పిన విధంగా ఒక్కో నియోజకవర్గంలో దళిత బంధు పథకం కింద 1115 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 1115 మంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 1,29,800 మందికి దళిత బంధు పథకం కింద లబ్ధి చేకూరుతుంది అని మంత్రి ఈశ్వర్ స్పష్టంచేశారు.


దళిత బంధు పథకం రెండో విడత అమలుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేయడంపై రాష్ట్ర ఎస్సి అభివృద్ది మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్స్ దళిత బంధు పథకం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. 


ఇది కూడా చదవండి: CM KCR: సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. పోడు భూముల పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్


దళితుల అభివృద్దిని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకొచ్చింది అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దళిత బంధు పథకం తొలి విడత కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందుకున్న కుటుంబాలు ఉన్నత ప్రమాణాలతో జీవనం కొనసాగిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాబోయే ఎనిమిదేళ్లలో దళిత బంధు పథకం కింద ప్రతీ దళిత కుటుంబానికి లబ్ది చేకూరుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. 


దళిత బంధు పథకంపై విపక్షాలు రాద్ధాంతం చేయడం మానేయాలని.. ఒకవేళ విపక్షాలు విమర్శలు చేసినా.. తెలంగాణ ప్రజలే ఆ విమర్శలను తిప్పి కొడుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వంపై, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే దళిత బంధు పథకంపై రాజకీయం చేస్తున్నారన్న మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఇది ఎంత మాత్రం మంచి ధోరణి కాదు అని ప్రతిపక్షాల నేతలకు హితవు పలికారు.


ఇది కూడా చదవండి: TSPSC Group-4: నేటి నుంచి గ్రూప్-4 హాల్‌టికెట్లు.. పరీక్షలో వేలిముద్ర తప్పనిసరి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook