డియర్ జిందగీ : కృతజ్ఞత భావానికి పెద్దపీట వేద్దాం
ఫ్రెంచ్ ఫార్వర్డ్ ఆంటోయిన్ గ్రీస్మ్యాన్ జట్టు విజయానికి అవసరమైన గోల్ చేశారు. అంతకంటే పెద్ద `గోల్` తర్వాత చేశాడు. అదేనండి అతని ప్రవర్తనతో ఎందరో అభిమానులను సంపాదించాడు. ఫలితంగా ఒక్క గోల్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు.
దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ
అతను వినయం, కృతజ్ఞత భావం చూపించాడు. గోల్ కొట్టాక ఉత్తేజితుడు కావల్సిన క్షణంలో కూడా అతను శాంతంగా ఉన్నాడు. జీవితం విలువలు తెలుసుకొని ఎత్తుకు ఎదిగాడు.
ప్రపంచమంతా ఇప్పుడు అందరి చూపు ఫిఫా వరల్డ్ కప్ ఫుట్‌బాల్ వైపే ఉంది. ఈ రోజు మ్యాచ్ పై మనస్సు లగ్నం చేస్తున్నాం. మనిషి ఒక్కడ మనసు మైదానంలో అన్నట్లుగా తయారైంది. మైదానంలో ఏ క్రీకారుడైనా గోల్ కొడితే చప్పట్లు కొడతాం.. ఎంజాయ్ చేస్తాం... ఇది సాధారణం. ప్రపంచ కప్ లో ఆటగాడు గోల్ చేస్తే.. అభిమాని ఎంత సంబరపడతాడో.. గోల్ చేసిన ఆటగాడు కూడా అంతే ఆనందం పొందుతాడు అవునా. అలాంటిది గోల్ చేశాక కూడా తనకు ఏం తెలియనట్లు శాంతంగా ఉన్నారంటే.. ఇంతకీ ఇతనికి ఏమైనట్టు..? బహుశా అతడు మరొకరి గురించి ఆలోచిస్తున్నాడేమో ? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి కదూ..
సరిగ్గా ఇదే జరిగింది... ఫ్రెంచ్ ఫార్వర్డ్ ఆంటోయిన్ గ్రీస్మ్యాన్ జట్టుకు అవసరమైన గోల్స్ కంటే ఎక్కువ చేశాడు. అంతకంటే పెద్ద 'గోల్' తర్వాత చేశాడు. అదేనండి తన ప్రవర్తనతో అభిమానుల మనసులను గెలిచాడు. ఇలా చేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు. మ్యాచ్ తరువాత గ్రీస్మ్యాన్ మాటలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆయనే చెబుతున్నారంటే.. 'నేను గోల్ చేశాక సంతోషపడలేదు. నేను కెరీర్ ప్రారంభించేటప్పుడు ఉరుగ్వే దేశానికి చెందిన ఓ వ్యక్తి నాకు సపోర్ట్ ఇచ్చాడు. వారే నాకు ఫుట్‌బాల్ నేర్పించారు. అందుకే ఉరుగ్వేపై గోల్ చేసేటప్పుడు నేను సంతోషపడలేదు' అన్నారు.
నాకు అసలు గ్రీస్మ్యాన్ అంటే ఎవరో తెలీదు.. ఆఖరికి నేను అతని అభిమానిని కూడా కాదు. నేను కేవలం ఫుట్‌బాల్ మ్యాచ్‌లో గోల్ కొడితే సంతోషపడే సాధారణ అభిమానిని మాత్రమే. కానీ గ్రీస్మ్యాన్ మాటలు విన్నాక నాకు అతనిపై గౌరవం పెరిగిందని ఓ అభిమాని చెప్పుకొచ్చాడు. దీనికి కారణం గోల్ సాధించిన తర్వాత కూడా అతను చూపించిన వినయం, కృతజ్ఞత భావం భేష్. గోల్ కొట్టాక ఉత్తేజితుడు కావల్సిన క్షణంలో కూడా అతను శాంతంగా ఉన్నాడంటే అతనిలో విలువలు ఏ మేరకు పాటిస్తాడనే విషయం తెలుస్తోంది.
వాస్తవానికి మన చుట్టూ ఉన్న సమాజం దీనికి వ్యతిరేకంగా నడుచుకుంటోంది. దాని ప్రభావంతో ఇతరులపట్ల ఉండవలసిన కనీస మర్యాద, గౌరవం లాంటి విలువలు కూడా తగ్గిపోతున్నాయి. రైలు, బస్సుల్లో కూర్చోవడానికి స్థలం దొరికేతే చాలు ఎదుటి వారి పట్ల దురుగా ప్రవర్తిస్తుంటాం .. ఒక వేళ కూర్చోవడానికి ఖాళీ దొరికితే ఇది మన సొంత ఆస్తిలా కాలు చాపి మరీ కూర్చుంటాము. అదేదో సింహాసనం అన్నట్టు ఫీలవుతారు. మనకంటే వయసుపైబడిన వాళ్లు, అంగవైకల్యం ఉన్న వాళ్లు వచ్చినా కూడా చాలా మంది తనకే పట్టనట్లు అలాగే కూర్చుంటారు...
కానీ అలాంటి సందర్భాల్లో కూడా కూర్చోవడానికి స్థలం ఇద్దాంలే అని ఆలోచించే వారు ఎంత మంది ఉంటారు..? వాస్తవానికి ఇలాంటి ఘటనలు చూసిన మీ చుట్టుపక్కన ఉన్నవాళ్లు 'ఏదైనా దొరికితే అది అతనికే చెందాలని కోరుకొనే మనస్తత్వం ఉండే వ్యక్తిలా ఉన్నాడు. అది అతనిదే.. సర్వహక్కులూ నావే అన్నట్లు ఉందే అతని వైఖరి' అని అనుకుంటారు. వాళ్లు ఇలా అనుకుంటారేమో అన్య ధ్యాస కూడా మనలో చాలా మందికి ఉండకపోవడం ఆశ్చర్యకరం.
వాస్తవానికి ఇలాంటి స్వార్థ మనస్తతత్వమే మనో మన జీవితంలో నెమ్మది.. నెమ్మదిగా ప్రవేశిస్తోంది. దీనివల్ల మనం ఈ భూమ్మీద ఎంత చిన్న భాగమో అనే విషయం కూడా మర్చిపోతున్నాం. మనం ఇతరుల వల్ల అవకాశం దొరికి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతాం. కానీ ఎవరివల్ల పైకి వచ్చామో.. వాళ్లని మర్చిపోతాం..మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో కదా !
ఆంటోయిన్ గ్రీస్మ్యాన్ అంత కాకుపోయినా కనీసం అందులో పావు నాలుగోవంతైనా ఆచరిస్తే మానవత్వానికి పెద్ద సహకారం అందించినట్లవుతుంది. వరల్డ్ కప్ ఎవరైనా గెలవని.. కానీ మానవత్వం, ప్రేమ, ఆత్మీయతలకు ఆంటోయిన్ గ్రీస్మ్యాన్ నిజమైన విజేత నిలిచాడనం లో ఎలాంటి సందేహం లేదు.
గ్రేట్ పీపుల్స్.. గుడ్ పీపుల్స్ కు మధ్య చిన్న వ్యత్యాసం ఉంది . గ్రేట్ పీపుల్స్ విజయంపై మాత్రమే దృష్టి పెడతారు. కానీ గుడ్ పీపుల్ విజయంతో పాటు ఒదిగి ఉండటం, కృతజ్ఞత భావం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఆదే కోవలోకి
వస్తాడు ఫుల్ బాల్ ఆటగాడు గ్రీస్మ్యాన్..
(ఈ ఆర్టికల్‌పై మీ సలహాలు, సూచనలు తెలియచేయండి: https://www.facebook.com/dayashankar.mishra.54,https://twitter.com/dayashankarmi)