Namrata Shirodkar Workout Video మహేష్‌ బాబు సతీమణిగా నమ్రతకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఈ తరం వారికి మాత్రం మహేష్ బాబు భార్యగానే నమ్రత తెలుసు. కానీ వంశీ, అంజీ వంటి సినిమాల్లో నమ్రత నటించిందని అందరికీ తెలియదు. ఇప్పుడు నమ్రత మళ్లీ తన ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టేసింది. ఆ మధ్య ఓసారి కాజువల్ లుక్‌లో నమ్రత కనిపిస్తే.. ఇలాంటి ఫోటోలు ఎందుకు పెడతారు? మేకప్ వేసుకుని ఫోటోలు దిగొచ్చు కదా? అని నెటిజన్లు కామెంట్లు చేశారు. దానిపై నమ్రత సున్నితంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఎలా ఫోటోలు దిగాలి.. ఎలాంటి ఫోటోలు పెట్టాలి అనేది తన ఇష్టమని నమ్రత తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు నమ్రత తన ఫిట్ నెస్ మీద ఫోకస్ పెట్టేసింది. మహేష్‌ బాబు కూడా ఇప్పుడు బాడీని పెంచేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మహేష్‌ బాబుతో పాటు నమ్రత కూడా జిమ్‌లో కసరత్తులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా నమ్రత జిమ్‌లో కష్టపడుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో నమ్రత భారీగానే వర్కౌట్లు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.


 



ఇక ఈ వర్కౌట్లను చూసి దేవీ శ్రీ ప్రసాద్ ఇలా కామెంట్ పెట్టాడు. మహేష్‌ బాబు గారే ఇప్పటి వరకు మాకు స్పూర్తివంతంగా ఉండేవారు.. ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని ఇన్ స్పైర్ చేస్తున్నారు మేడం అని చెప్పుకొచ్చాడు. ఇక అడివి శేష్ అయితే నమ్రత ఆన్ ఫైర్ అన్నట్టుగా ఫైర్ ఎమోజీలను షేర్ చేశాడు. అయితే నమ్రత జస్ట్ హెల్త్ కోసం ఇలా చేస్తుందా? లేదంటే మళ్లీ స్క్రీన్ మీదకు వచ్చేందుకు ఇలా చేస్తోందా? అన్నది తెలియడం లేదు.


నమ్రత తాజాగా యాడ్‌లోనూ నటించిన సంగతి తెలిసిందే. సితారా, నమ్రతలు కలిసి చాక్లెట్ యాడ్‌లో కనిపించారు. మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్‌ ఫుల్ స్వింగులో నడుస్తోంది. ఇక ఈ మూవీ తరువాత మహేష్‌ బాబు రాజమౌళి కాంబోలో ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తోంది. విజయేంద్ర ప్రసాద్ కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లేందుకు చాన్స్ ఉంది.


Also Read:  Samantha Stylist Preetham : అర్దనగ్నంగా సమంత ఫ్రెండ్ ప్రీతమ్.. ఆ మూడ్‌లో ఉన్నట్టున్నాడే


Also Read: Shriya Saran Pics : ఇంతకంటే క్లియర్‌గా ఎవ్వరూ చూపించరేమో.. శ్రియా ఎద అందాల ప్రదర్శన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook