మల్టీస్టారర్ చిత్రాలకు ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్‌ల కాలం నుండే బాగా క్రేజ్ ఉంది అని చెప్పొచ్చు. వారి కెరీర్‌లో ఎక్కువ మల్టీస్టారర్‌లుగా ఇటు పౌరాణిక చిత్రాలైనా, అటు కమర్షియల్ సినిమాలైనా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశాయి. అలాగే ఈ తరంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, ఎఫ్2, బాహుబలి, మనం, వెంకీ మామ వంటి సినిమాలతో మల్టీస్టారర్ అంటే మరింత క్రేజ్‌ని పెంచాయి. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీ ( RRR movie ) కోసం జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ), రామ్ చరణ్‌లు ( Ram Charan ) కలిసి నటిస్తున్నారు. Also read : Balakrishna vs Chiranjeevi: చిరు-బాలయ్య బాబు వివాదంపై తనదైన స్టైల్లో స్పందించిన మోహన్ బాబు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే ప్రముఖ నిర్మాత Dil Raju కూడా మరో మల్టీస్టారర్‌ను రూపొందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో ( Prabhas, Allu Arjun multistarrer ) నటించనున్నట్లు సమాచారం. ఈ మల్టీస్టారర్‌ని ఆర్‌ఆర్‌ఆర్ కంటే భారీ స్థాయిలో నిర్మించాలని దిల్ రాజు భావిస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. Also read : Anchor Pradeep: గ్యాంగ్ రేప్ కేసుపై స్పందించిన యాంకర్ ప్రదీప్


ఇంతకుముందు ఓసారి దిల్ రాజుకు ఒక సినిమా కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చాడంట. కాని ఆ చిత్రం కార్యరూపం దాల్చలేదు. అలాగే డీజే విడుదలైన తర్వాత అల్లు అర్జున్‌తో కలిసి మరో సినిమాని దిల్ రాజు ప్రకటించాడని, అయితే ఈ చిత్రం కూడా ఏవో కారణాల వల్ల ఆగిపోయిందని వార్తలొచ్చాయి. ఇప్పుడు దిల్ రాజు మల్టీస్టారర్ కోసం ప్రభాస్, అల్లు అర్జున్‌లతో కలిసి ఓ సినిమా ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. Also read : Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా పోలీస్ లవ్ స్టోరీ


ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ( Radhe shyam ) కోసం పనిచేస్తుండగా, అల్లు అర్జున్ పుష్ప మూవీ షూటింగ్‌ను ( Pushpa movie shooting ) తిరిగి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. రాధే శ్యామ్ పూర్తవగానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ( Director Nag Ashwin ) ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అది పూర్తయిన అనంతరం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్‌తో కలిసి ప్రభాస్ ఆదిపురుష్ మూవీతో ( Adipurush movie ) బిజీ కానున్నాడు. ఇవన్నీ పూర్తవడానికి ఎంత లేదన్నా ఐదేళ్లు పట్టొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంద. అలాగే అల్లు అర్జున్ చేతిలోనూ పలు చిత్రాలు క్యూలో ఉన్నాయి. అందుకే ఇక ప్రభాస్, అల్లు అర్జున్‌ల సినిమా అంటే ఆ తర్వాతే అని అనుకోవాల్సిందే. ఈ ఇద్దరి హీరోలకి డేట్స్ కుదిరి ఈ మల్టీస్టారర్‌ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో వేచి చూడాల్సిందే మరి. Also read : ఒక్కో ఎపిసోడ్‌కి 2 లక్షలు కావాలంటున్న హీరోయిన్