Adipurush: ప్రభాస్ పాత్రపై నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్

ప్రభాస్ 22వ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఆ చిత్ర నిర్మాతలు ఆదిపురుష్ ( Adipurush ) అనే టైటిల్‌ను అలా ప్రకటించారో లేదో క్షణాల్లోనే సోషల్ మీడియాలో ఆదిపురుష్ టైటిల్ వైరల్‌గా మారింది. సాహో (Saaho ), బాహుబలి ( Baahubali ) తరహాలో దేశ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసే విధంగా తెరకెక్కనున్న ఈ సినిమాను తన్హాజి ఫేమ్ ఓం రావుత్ దర్శకత్వం వహించనున్నారు.

Last Updated : Aug 20, 2020, 11:14 PM IST
Adipurush: ప్రభాస్ పాత్రపై నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్

ప్రభాస్ 22వ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఆ చిత్ర నిర్మాతలు ఆదిపురుష్ ( Adipurush ) అనే టైటిల్‌ను అలా ప్రకటించారో లేదో క్షణాల్లోనే సోషల్ మీడియాలో ఆదిపురుష్ టైటిల్ వైరల్‌గా మారింది. సాహో (Saaho ), బాహుబలి ( Baahubali ) తరహాలో దేశ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మళయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసే విధంగా తెరకెక్కనున్న ఈ సినిమాను తన్హాజి ఫేమ్ ఓం రావుత్ దర్శకత్వం వహించనున్నారు. ఆదిపురుష్ టైటిల్ లోగో విడుదల చేసినప్పటి నుండి, ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నప్పటికి, మేకర్స్ ఈ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదు. Also read :  Surekha Vani: కనిపించిన ప్రతీ మగాడితో అఫైర్స్ అంటగడుతున్నారని నటి ఆవేదన

ఐతే, ప్రభాస్ తర్వాతి చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న నాగ్ అశ్విన్ ( Nag Ashwin ) చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు.. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ పాత్ర ఏంటనే విషయాన్ని లీక్ చేసినట్టయింది. ప్రభాస్‌ని శ్రీరాముడిగా ( Prabhas as Sriram ) చూడాలని ఉంది అని నాగ్ అశ్విన్ చేసిన పోస్టు ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ పాత్ర ఏంటనే విషయాన్ని చెప్పకనే చెప్పిందనే టాక్ మొదలైంది. అది మొదలు.. ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ పాత్రపై అనేక ట్వీట్స్, ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు మొదలయ్యాయి. Also read : Bigg Boss 4: బిగ్ బాస్ 4 లో ఫేమస్ కొరియోగ్రాఫర్ ?

ఆదిపురుష్ టైటిల్ లోగో విడుదల చేసిన తరువాత నాగ్ అశ్విన్ ఓం రావుత్ చేసిన ట్వీట్‌కి స్పందించారు. '' ప్రభాస్ గారిని శ్రీరాముడిలా చూడటం చాలా ఉత్సాహంగా ఉంది… ఇంతకు ముందు చాలా తక్కువ మంది నటులు మాత్రమే శ్రీ రాముని పాత్రను బిగ్ స్క్రీన్‌పై చూసుకునే అవకాశం పొందారు. మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు ''అని తెలిపారు. Also read : Sanitizer Ganesha idols: గణేష్ విగ్రహాలు కొంటున్నారా ? ఈ శానిటైజర్ గణేషాను చూడండి

అప్పటికే ఆదిపురుష్ టైటిల్ లోగోలో ఉన్న చెడుపై మంచి గెలుపు అనే క్యాప్షన్ కనపడటం, రాముడు విల్లు పట్టుకున్న బొమ్మను లోగోలో పొందుపర్చడం, మరోపక్క హనుమంతుడు కనిపించడం, అన్నింటికిమించి శ్రీరాముడు అంటేనే ఆదిపురుషుడు అనే పేరుండటం వంటివన్నీ ఈ సినిమా నేపథ్యాన్ని చెప్పకనే చెప్పాయి. దీనికితోడు.. నాగ్ అశ్విన్ చేసిన ఈ ట్వీట్ కూడా ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్టయింది. టి-సిరీస్ బ్యానర్ ద్వారా నిర్మించబోతున్న ఈ చిత్రం 2022 లో తెరపైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Also read : Vakeel Saab teaser: వకీల్ సాబ్ టీజర్‌కి ముహూర్తం ఖాయం ?

Trending News