Radha Madhavam: ఇంట్లో నుంచి పారిపోయి వచ్చా.. పార్ట్ టైమ్ జాబ్ చేశా: `రాధా మాధవం` డైరెక్టర్ దాసరి ఇస్సాకు
Radha Madhavam Director Dasari Issaku: మార్చి 1న ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది రాధా మాధవం మూవీ. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఆడియన్స్‌ను తప్పకుండా ఆకట్టుకుంటుందని దర్శకుడు చెబుతున్నారు.
Radha Madhavam Director Dasari Issaku: వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ జంటగా దాసరి ఇస్సాకు డైరెక్షన్‌లో రూపొందిన మూవీ ‘రాధా మాధవం’. వసంత్ వెంకట్ బాలా కథ, మాటలు, పాటలు రాయగా.. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. మార్చి 1న విడుదల కానున్న ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్, టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో తప్పకుండా సక్సెస్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో దర్శకుడు దాసరి ఇస్సాకు మీడియాతో ముచ్చటించారు.
చిన్నతనం నుంచే తనకు సినిమాల మీద ఆసక్తి ఉండేదని.. అందుకే ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్‌కు వచ్చానని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ ఏదో పని చేసుకుంటూ సినిమాల్లో ప్రయత్నాలు చేశానని.. ఎడిటింగ్, కెమెరా ఇలా అన్ని డిపార్ట్‌మెంట్‌లో పనిచేశానని అన్నారు. డైరెక్షన్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో అన్నపూర్ణ ఇనిస్టిట్యూట్‌లో చేరానని.. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ డబ్బులు కూడబెట్టుకునేవాడినని చెప్పారు. డైరెక్షన్ విభాగంలో ట్రైనింగ్ తీసుకుని ఇనిస్టిట్యూట్ నుంచి బయటకు వచ్చానని అన్నారు.
2019లో తెలిసిన ఓ ఫ్రెండ్ ద్వారా ప్రొడ్యూసర్ గోనాల్ వెంకటేష్ పరిచయం అయ్యారని.. ఆహా కోసం ఓ సినిమాను తీయాలని ముందుగా తాము కలిసి పని చేశామన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని.. ఆ తరువాత నిర్మాత ఈ రాధా మాధవం స్టోరీని తనకు చెప్పారని తెలిపారు. రచయిత వసంత్ రాసిన ఈ కథను తనకు వినిపించడంతో బాగా నచ్చిందని.. అలా ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టామన్నారు. వినాయక్ దేశాయ్‌తో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని.. కటౌట్ బాగుంటుందని ఈ సినిమాకు తీసుకున్నామన్నారు. హీరోయిన్ కోసం చాలా వెతికామని.. హీరో ఎత్తుకు సరిపోయేలా ఉండాలని చూశామన్నారు.
అపర్ణా దేవీ నటన బాగుంటుందని.. హైట్ తక్కువైనా పర్లేదని ఆమెను ఎంపిక చేశామన్నారు దర్శకుడు దాసరి ఇస్సాకు. రాధా మాధవం సినిమా పాటలు, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చిందని.. దీంతో సినిమాపై బజ్ పెరిగిందన్నారు. ఇంతటి పాజిటివ్ రెస్పాన్స్ చూసి చాలా ఆనందమేసిందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కొల్లి చైతన్య మంచి సాంగ్స్ ఇచ్చారని.. ఆర్ఆర్ కూడా అద్భుతంగా ఉంటుందన్నారు. ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని.. అందరికీ మెచ్చే అంశాలతో పాటు యూత్‌ను అట్రాక్ట్ చేసే లవ్ సీన్స్ ఉన్నాయన్నారు. ప్రేమతో పాటు మంచి సందేశాన్నిచ్చేలా రూపొందించామన్నారు. మార్చి 1న తమ సినిమాను చూసి ఆదరించాలని కోరారు.
Also Read: ఒక్క ఎంపీ సీటైనా గెలవండి.. కేటీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్
Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter