చెన్నై : ప్రముఖ దర్శక నిర్మాత త్యాగరాజన్ (74 ) తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని వలసరవాక్కంలోని తన స్వగృహంలో ఆదివారం గుండెపోటుకు గురై ఆయన కన్నుమూశారు. కాగా త్యాగరాజన్ కు భార్య, ఒక కుమారుడు, ఒక  కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపై రజనీకాంత్, కమలహాసన్ సహా  పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్యాగరాజన్ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో దాదాపు 35  చిత్రాలను దర్శకుడిగా ఆయన తెరకెక్కించారు. 


తొలుత నిర్మాతగా వ్యవహరించిన త్యాగరాజన్ తర్వాతి కాలంలో దర్శకుడి అవతారమోత్తి పలు హిట్ చిత్రాలను తీశారు. రజనీకాంత్, కమలహాసన్ వంటి అగ్రనటులతో కూడా ఆయన సినిమాలు నిర్మించారు.  త్యాగరాజన్‌  ఎంజీఆర్‌  నటించిన పలు చిత్రాలను నిర్మించడంతో పాటు దర్శకుడిగా  రజనీకాంత్‌తో  తాయ్‌వీడు,  తాయ్‌ మీదు సత్యం, అన్నై ఒర్‌ ఆలయం, అన్బుక్కు నాన్‌ అడిమై 8 చిత్రాలతో పాటు కమలహాసన్‌ హీరోగా రామ్‌లక్ష్మణన్, తాయ్‌ ఇల్లామల్‌ నాన్‌  ఇల్‌లై.. విజయ్‌కాంత్‌తో నల్లనాళ్, అన్నైభూమి 3డీ, హిందీలో రజనీకాంత్, రాజేవ్‌ఖన్నాలతో రెండు చిత్రాలు అంటూ మొత్తం 35 చిత్రాలను తెరకెక్కించారు.