VN Aditya: డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మరో ఘనత.. అమెరికా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్
Director VN Aditya Doctorate: ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్యకు అరుదైన సాధించారు. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. సినిమా రంగం నుంచి ఆయన ఎంపికయ్యారు. ఈ డాక్టరేట్ ను తన అమ్మకు అంకితం ఇస్తున్నట్లు వీఎన్ ఆదిత్య తెలిపారు.
Director VN Aditya Doctorate: డైరెక్టర్ వీఎన్ ఆదిత్య సినిమాలు ఎంత క్లాస్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ తెరపై దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 'మనసంతా నువ్వే', 'నేనున్నాను' వంటి క్లాసిక్ హిట్స్‌తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాతికేళ్లుగా తెలుగు పరిశ్రమలో కొనసాగుతున్న ఆయన.. ఎంతోమందికి తన వంత సహాయ సహకారాలు అందించారు. ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తించి అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ గౌరవ డాక్టరేట్‌తో వీఎన్ ఆదిత్యను సత్కరించింది.
Also Read: Telangana: ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. రద్దు చేయనున్నారా లేక?
బెంగుళూరులో జరిగిన ఇంటర్నేషనల్ పీస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వివిధ రంగాలలోని ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేసింది. సినిమా రంగం నుంచి డైరెక్టర్ వీఎన్ ఆదిత్యకు డాక్టరేట్ దక్కింది. ఈ వేడకకు చీఫ్ గెస్ట్‌గా నీతి ఆయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప, సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ డైరెక్టర్ నీలమణి, నేషనల్ SC & ST కమిషన్ సభ్యుడు దినేష్ గురూజీ అతిథులుగా పాల్గొన్నారు.
డాక్టరేట్ అందుకున్న అనంతరం దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ఈ డాక్టరేట్ గౌరవాన్ని మా అమ్మగారికి అంకితం ఇస్తున్నానని తెలిపారు. తాను సినీ రంగంలో కాకుండా విద్యారంగంలో ఉన్నతస్థాయిలో ఉండాలని అమ్మ కోరుకుందని గుర్తు చేసుకున్నారు. తాను ఇష్టపడిన సినిమా రంగంలో డాక్టరేట్ పొందడం తనకే కాదు అమ్మకు కూడా సంతోషాన్ని ఇచ్చే విషయన్నారు. తనకు గౌరవ డాక్టరేట్ అందించిన అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వారికి కృతజ్ఞతలు చెప్పారు. డాక్టరేట్ పొందిన వీఎన్ ఆదిత్యకు సినీ ఇండస్ట్రీలోని పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ప్రస్తుతం లవ్ @ 65 అనే మూవీని వీఎన్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. నట కిరీటి డా.రాజేంద్ర ప్రసాద్, జయప్రద కీలక పాత్రలు పోషించగా.. ఇటీవల ట్రైలర్ లాంచ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 70 ఏళ్ల వయసున్న వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ నటిస్తుండగా.. 65 ఏళ్ల మహిళగా జయప్రద యాక్ట్ చేశారు. లేటు వయసులో వాళ్లిద్దరూ ప్రేమలో పడటం.. ఆ తరువాత ఇంటి నుంచి పారిపోవడం.. వీళ్ల కోసం కాలనీ వాసులు వెతకడం వంటివి ట్రైలర్‌లో చూపించారు. లేటు వయసులో ప్రేమ కథ ఏంటో తెలియాలంటే లవ్ @ 65 తెరపై చూడాల్సిందే.
Also Read: Ashish Wedding Reception: హీరో ఆశీష్ జంటను ఆశీర్వదించిన చెర్రీ, విజయ్, నాగ్, నమ్రత, ఇతర ప్రముఖులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter