'కుక్కులకూ లైసెన్సులు' ఇదేంటని ఆశ్యర్యపోతున్నారా ! ..ఇది ముమ్మాటికి నిజం.  బెంగళూరులో సరికొత్త రూల్ పాస్ అయింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కుక్కలను పెంచుకోవాలంటే నగర పాలక సంస్థ నిబంధనలు పాటించాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిబంధనలు ఇవే..


తాజా నింబంధనలను అనుసరించి ఇంట్లో ఇక కుక్కలను పెంచుకోవాలంటే లైసెన్స్ తీసుకుని రేడియో కాలర్‌తో కూడిన ఎంబెడెడ్ చిప్ తీసుకోవాల్సి ఉంది.  అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో ఒక పెంపుడు కుక్క కంటే ఎక్కువగా పెంచుకోకూడదు. అలాగే లాగే ఇండిపెండెంట్ ఇళ్లలో 3 కుక్కల కంటే అధికంగా పెంచుకోకూడదట. తాజా నిబంధనలపై ఇవేం నింబంధనలు బాబోయ్ అంటూ బెంగళూరు మున్సిపల్ కార్పోరేషన్ పై స్థానికులు మండిపడుతున్నారు.