డొనాల్డ్ ట్రంప్ ఫోటోకి పూజలు చేస్తున్న తెలంగాణ యువకుడు
వెర్రి వెయ్యి విధాలు అంటారు. కానీ ఇది వెర్రో.. పిచ్చో కాదు... అపారమైన భక్తి మాత్రమే అంటున్నాడు తెలంగాణలోని జనగాంకి చెందిన బుస్సా క్రిష్ణ. ఈ యువకుడు గత కొంతకాలంగా డొనాల్డ్ ట్రంప్‌కి ప్రతీ రోజు పూజ చేయడమే పనిగా పెట్టుకున్నాడు.
వెర్రి వెయ్యి విధాలు అంటారు. కానీ ఇది వెర్రో.. పిచ్చో కాదు... అపారమైన భక్తి మాత్రమే అంటున్నాడు తెలంగాణలోని జనగాంకి చెందిన బుస్సా క్రిష్ణ. ఈ యువకుడు గత కొంతకాలంగా డొనాల్డ్ ట్రంప్‌కి ప్రతీ రోజు పూజ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ట్రంప్ ఫోటోకి బొట్టు పెట్టి.. పూలు పెట్టి అర్చన చేయడం కూడా చేస్తున్నాడు.
అమెరికా ఎన్నికలప్పుడు తొలిసారిగా తాను ట్రంప్‌ని చూశానని.. వివక్షతో కూడిన నేరాలను ప్రతిఘటించిన ట్రంప్ తనకు ఎంతో నచ్చేశాడని.. అందుకే ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం కోసం తాను అమెరికా అధ్యక్షుడిని ఆరాధించడమే పనిగా పెట్టుకున్నానని అంటున్నాడు బుస్సా క్రిష్ణ. అమెరికాలో భారతీయుల పట్ల వివక్ష తగ్గాలని.. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటడం కోసమే తాను ట్రంప్ ఫోటోకి రోజూ పూజలు చేస్తున్నానని అంటున్నాడు ఈ యువకుడు.
అయితే చాలా మంది బుస్సా క్రిష్ణ చేస్తున్న ఈ పనులను పబ్లిసిటీ స్టంట్‌గా కొట్టి పారేశారు. ఏదో విధంగా ప్రచారం పొందాలని అనుకొనే వారు మాత్రమే ఇలా చేస్తారని చాలామంది ఆరోపించారు. అయితే ఇవేవీ తాను పట్టించుకోనని.. ట్రంప్‌కి వీలైతే ఒక ఆలయాన్ని కడతానని అంటున్నాడు బుస్సా క్రిష్ణ. ప్రస్తుతం ట్రంప్ అభిమానులు చాలామంది కూడా కూడా క్రిష్ణకి అభిమానులు అయిపోయారు.