Instant energy drinks: హైద‌రాబాద్‌: వేసవి వేడి నుంచి ఇంకా ఉపశమనం లభించడం లేదు. ఓవైపు నైరుతి రుతు పవనాలు ( Monsoon) కేరళను తాకి ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఇంకా పలు చోట్ల ఎండ వేడి మాత్రం అలాగే ఉంది. నైరుతి రుతు పవనాల రాకతో కొన్ని ప్రదేశాల్లో, నిసర్గ తుఫాన్ ప్రభావంతో ( Cyclone Nisarga) ఇంకొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. దేశంలో పలు చోట్ల సమ్మర్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు. ముఖ్యంగా ఎండల్లోనే పనులు చేసుకుంటూ బయట తిరిగే వారి ఆరోగ్యంపై ఈ వేడి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎండ‌ తీవ్రతకు శ‌రీరం డీ హైడ్రేష‌న్‌కు ( Dehydration issues) గురై అలసట వస్తుంది. ఇంకొందరిలో వెంటనే కళ్లు తిరగడం లాంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. ఆ ఇబ్బందులను అధిగమించాలంటే మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే పానీయాలు ఎక్కువ‌గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు వైద్య నిపుణులు. Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మజ్జిగ : పెరుగును మజ్జిగలా చేసుకోవాలి. ఈ మజ్జిగలో నిమ్మ ఆకులు వేసి, కొంచెం ఉప్పు, క‌రివేపాకు కలిపి తాగితే ఒంట్లో వేడికి ఉప శమనం లభిస్తుంది. 


ష‌ర్బ‌త్‌ : మండు వేసవిలో శరీరం వెంటనే డీ హైడ్రేష‌న్ బారిన పడుతుంది. అందుకే వేడి నుంచి శీగ్ర ఉపశమనాన్ని ఇచ్చే ష‌ర్బ‌త్ తీసుకుంటే శరీరానికి చలువ. ఒక గ్లాస్ నీళ్లలో నిమ్మ‌కాయ రసం పిండుకుని దానికి అనుగుణంగా ఒక రెండు టీ స్పూన్స్ పంచదార కలిపి ష‌ర్బ‌త్ చేసుకుని తాగితే.. ఒంట్లో వేడి హుష్ మటాష్ అనాల్సిందే.


కొబ్బ‌రి నీళ్లు: ఎండ వేడి నుంచి త్వరగా ఉపశమనం ఇచ్చే వాటిలో కొబ్బరి నీళ్లు ముందుంటాయి. అందుకే ఎండా కాలం ఎక్కడ చూసినా కొబ్బరిబోండాలు విరివిగా లభ్యమవుతుంటాయి. కొబ్బరి నీళ్లతో వేడికి చెక్ పెట్టడంతో పాటు డీ హైడ్రేషన్ సమస్యల నుంచి కూడా శరీరాన్ని కాపాడుకోవచ్చు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live link here..