ఇప్పటికే తమ యూజర్స్‌ని ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తమ యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా మరో ఫీచర్‌తో యూజర్స్ ముందుకొస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ మ్యూజిక్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫేస్‌బుక్ స్టోరీల్లోని ఫోటోలు, వీడియోలకు తమకు నచ్చిన పాటలను జోడించే వీలుంది. ఈ ఫీచర్ ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్‌కి సైతం వర్తిస్తుందని బుధవారం ఫేస్‌బుక్ ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే యూజర్స్ తమ ప్రొఫైల్స్‌కి కూడా పాటలు జోడించే ఫీచర్ అందుబాటులోకి రానుందని ఫేస్‌బుక్ ఈ ప్రకటనలో పేర్కొంది. 


ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాగైతే ఫోటో, వీడియోలకు పాటలను యాడ్ చేయవచ్చో.. అదే తరహాలో ఫేస్‌బుక్ఋలోనూ పాటలు యాడ్ చేయవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది. ఫేస్‌బుక్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సరికొత్త మ్యూజిక్ ఫీచర్‌తో యూజర్లు తమ ఫోటో, వీడియోలకు మరింత ప్రాణం పోయవచ్చు.