RRR ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న రాజ్ మౌళి..కుమారుడు కార్తికేయ పెళ్ళి కోసమని బ్రేక్ తీసుకున్నాడు. అయితే సెకండ్ షెడ్యూల్ బిగిన్ చేసిన జక్కన్న ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ పైనే ఫోకస్ పెట్టాడు. సెకండ్ షెడ్యూల్ కూడా చివరిదశకు వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హీరోయిన్ ఎవరు ?


అయితే ఇప్పటి వరకు చెర్రీ సరసన జోడీ కట్టనున్న హీరోయిన్స్ విషయం ఇంకా బయటికి రాలేదు. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా ఫిక్సయిందనే న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. మరోవైపు ఆలియా భట్ ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేసిందనే టాక్ కూడా ఉంది. 


ప్రతినాయకుడెవరు ?


హీరోయిన విషయం అలా ఉంచితే ఇప్పటి వరకు RRR లో విలన్ ఎవరనే విషయం కూడా తెలియరాలేదు. కనీసం ఆ వివరాలు రిలీజ్ చేసినా ఫ్యాన్స్ కి కాస్త ఊరటగా ఉండేది. విలన్ ఎవరో తెలీకపోయేసరికి  NTR ఈ సినిమాలో బందిపోటు నాయకుడని వీళ్ళిద్దరికీ మధ్య జరిగే ఘర్షణే సినిమా అని అభిమానులు సొంత స్క్రిప్ట్ రాసేసుకుంటున్నారు. 


రేపో మాపో సెకండ్ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పనున్న ఫిల్మ్ యూనిట్.. అప్పుడైనా ఈ సినిమాకి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రివీల్ చేస్తారో లేదో చూడాలి మరి.