భారతదేశంలో తొలిసారిగా పోషకాహారంపై యాప్
భారతదేశంలో తొలిసారిగా పోషకాహారంపై యాప్ అందుబాటులోకి వచ్చింది.
భారతదేశంలో తొలిసారిగా పోషకాహారంపై యాప్ అందుబాటులోకి వచ్చింది. "న్యూట్రిఫై ఇండియా" పేరుతో రూపొందిన ఈ యాప్‌ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. ఈ యాప్ అందరికీ ఎలాంటి పోషకాహారం తీసుకోవాలో తెలియజేస్తుంది.
ముఖ్యంగా పసిపిల్లలు, ఎదుగుతున్న పిల్లలు, మహిళలు, బాలింతలు తీసుకోవాల్సిన పోషకాహారంపై ఈ యాప్‌లో వర్గీకరణ అనేది ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యాప్‌ను పరిపూర్ణమైన హెల్త్ గైడ్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చని అంటున్నారు నిపుణులు.
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ యాప్‌ను ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో యూజర్ల సౌలభ్యం కోసం My Nutrients Requirements, Nutrients in my Food, My Diet and Activity, Search Food by Nutrition, Search Food by Language లాంటి ప్రత్యేకమైన ఆప్షన్లు ఉన్నాయి.
ఈ ఆప్షన్ల ద్వారా మీ శరీర తత్వాన్ని బట్టి ఎలాంటి డైట్ తీసుకోవాలి, డైట్ తీసుకొనేటప్పుడు పాటించాల్సిన నియమాలు లాంటి అంశాలు అన్ని కూడా ఎంచుకోవచ్చు.
ఆంగ్లం, తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే కాకుండా దాదాపు 14 భాషల్లో ఇప్పుడు ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే విదేశాల్లో ఇలాంటి యాప్‌లు అనేకం ఉన్నప్పటికీ భారతదేశంలో తొలిసారిగా ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో డిజైన్ చేసిన తొలి పోషహాకార యాప్ ఇదే కావడం విశేషం.