Side Effects of Flaxseeds: అవిసె గింజలు ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండేయ ఆయుర్వేద గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ అవిసె గింజలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. ఇందులో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైటోకెమికల్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని డ్రింక్స్‌, ఆహారాల్లో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది అవిసె గింజలను అతిగా తీసుకుంటున్నారు. వీటిని ఎక్కువగా ఆహారాల్లో తీసుకోవడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అతిగా అవిసె గింజలను తింటున్నారా? ఈ నష్టాలు తప్పవు:


కడుపు నొప్పి:
అవిసె గింజలను అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల విరేచనాలు వంటి సమస్యలకు దారి తీసే ఛాస్స్‌ కూడా ఉంది. వీటిని అతిగా తీసుకునేవారిలో ప్రేగు సంబంధిత సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు


మలబద్ధకం సమస్యలకు దారి తీయోచ్చు:
ఇప్పటికే తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నవారు అవిసె గింజలను తగిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అతిగా ఈ గింజలను తీసుకుంటే పొట్ట సమస్యలతో పాటు, మలబద్ధకం ఇతర తీవ్ర వ్యాధులకు దారి తీసే ఛాన్స్‌ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


అలర్జీ:
అవిసె గింజలను అతిగా తీసుకునేవారిలో అలర్జీ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. దీని కారణంగా తీవ్ర చర్మ సమస్యలకు దారి తీసే ఛాన్స్ కూడా ఉంది. కొందరిలో తీవ్ర వాంతులు కూడా వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీటిని అతిగా ఆహారాల్లో తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. 


రక్తస్రావానికి దారి తీయోచ్చు:
అవిసె గింజలు అతిగా తినేవారిలో రక్తస్రావం సమస్యలకు దారి తీయోచ్చు. ఇవే కాకుండా చాలా మందిలో చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పటికే రక్తస్రావం సమస్యలతో బాధపడేవారు అతిగా అవిసె గింజలను తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook