RS 4 Thousand offer on Redmi Note 10S Mobile in Flipkart Big Saving Days Sale: ప్రముఖ చైనీస్ మొబైల్ సంస్థ 'షావోమీ' రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 10ఎస్ (Redmi Note 10S) స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 6GB + 64GB, 8GB + 128GB వేరియంట్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వేరియంట్‌లపై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ భారీ తగ్గింపు ప్రకటించింది. 'బిగ్ సేవింగ్ డేస్' సేల్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్‌లపై 23 శాతం ఆఫర్ ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు (జులై 22) 'బిగ్ సేవింగ్ డేస్' సేల్ ఆరంభం అయింది. ఈ సేల్‌లో భాగంగా రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్‌ (64 GB, 6 GB RAM)పై 23 శాతం డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 16,999 ఉండగా.. రూ. 12,999 లకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మీ నోట్ 10ఎస్ 128 GB, 8 GB RAM వేరియంట్‌ అసలు ధర రూ. 20,999లు కాగా.. ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ సేవింగ్ డేస్ సేల్ ద్వారా 21% తగ్గింపు లభిస్తుంది. అప్పుడు 4,500 తగ్గింపుతో రూ. 16,499లకు కొనుగోలు చేయవచ్చు.


అయితే మిగతా మొబైల్స్ మాదిరిగా రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై కేవలం 'బిగ్ సేవింగ్ డేస్' సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ఇచ్చిన ఆఫర్ మాత్రమే ఉంది. అయితే ఈ ఆఫర్ కొద్ది గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ కొనేందుకు వినియోగదారులు ఎగబడుతున్నారు. 


Redmi Note 10S స్పెసిఫికేషన్లు:
# 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లే
# 1080×2400 పిక్సెల్ రిజల్యూషన్
#  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కోటింగ్‌
# ఆండ్రాయిడ్ 11 ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టం 
మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌
# 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ (8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా)
# 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
# 5000 mAh బ్యాటరీ 


Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రెడ్‌మీ 10పై రూ. 5 వేల తగ్గింపు! ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా


Also Read: KTR TWEET: ప్రధాని మోడీకి కేటీఆర్ ధ్యాంక్స్.. బండికి ఆ పదవి ఇచ్చారా? 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.