Girl Student Dances on Chikni Chameli Song: క్లాస్ రూమ్‌లో చికినీ చమేలీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లాస్ రూమ్‌లో చికినీ చమేలీ ఏంటనుకుంటున్నారా ? అయితే మీరు ఈ వీడియో కచ్చితంగా చూడాల్సిందే. అంతేకాదు.. ఒకసారి చూశాకా ఇంకోసారి చూడకుండా ఉండలేరు. అంత క్రేజీగా ఉందీ వైరల్ వీడియో. హృతిక్ రోషన్, సంజయ్ దత్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన అగ్నిపథ్ మూవీలో కత్రినా కైఫ్ చేసిన చికినీ చమేలీ అనే ఐటం సాంగ్ కుర్రకారును ఎంత ఊపు ఊపిందో అందరికీ తెలిసిందే. సరిగ్గా పదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ చేసిన ఈ ఐటం సాంగ్ ఇప్పటికైనా, ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ స్పెషల్ సాంగ్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుర్రకారును హీటెక్కించిన చికిని చమేలీ పాటపై క్లాస్ రూమ్‌లో విద్యార్థిని, విద్యార్థులు అందరి ముందు లైవ్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి. ఇంకా చెప్పాలంటే.. కత్రినా కైఫ్‌ని మరిపించేంతలా హోయలొలికిస్తూ.. బాడీని గ్రేస్‌లో షేక్ చేస్తూ విద్యార్థిని చేసిన డాన్స్ చూసి క్లాస్ రూమ్ అంతా షేక్ అయిపోయింది. విద్యార్థిని డాన్స్‌తో క్లాస్ రూమ్ కాస్తా చప్పట్లు, ఈలలతో ఒక్కసారిగా థియేటర్‌లా మారిపోయింది. 


వీడియోను నిశితంగా పరిశీలించి చూస్తే.. విద్యార్థిని వెనుకాలే ఉన్న బోర్డును గమనిస్తే.. హ్యాపీ టీచర్స్ డే అని బోర్డుపై రాసి ఉండటం కనిపిస్తోంది. అంటే టీచర్స్ డే సెలబ్రేషన్స్ రోజే ఈ హాట్ హాట్ డాన్స్ పర్‌ఫార్మెన్స్ జరిగి ఉండొచ్చనిపిస్తోంది. 



దీంతో ఈ వీడియో చూసిన నెటిజెన్స్‌లో కొంతమంది చూసిన వీడియోనే మళ్లీ మళ్లీ చూస్తూ ఔరా అని ముక్కున వేలేసుకుంటుంటే.. ఇంకొంతమందేమో క్లాస్ రూమ్‌లో ఏంటీ తింగరేషాలు అని మండిపడుతున్నారు. పవిత్రమైన టీచర్స్ డే నాడు.. అది కూడా క్లాసికల్ సాంగ్ కాకుండా తోటి విద్యార్థుల ముందు ఇలా ఐటం సాంగ్ పై ఆ సెక్సీ డాన్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీనేజ్ వయస్సులో ఇలా ఐటం సాంగ్‌పై సెక్సీగా స్టెప్పులేస్తే.. ఆ రోజు నుంచి అబ్బాయిలు ఆ అమ్మాయిని చూసే చూపుల్లో కూడా తేడా వస్తుందని కామెంట్స్ పెడుతున్న వాళ్లు కూడా లేకపోలేదు.


Also Read : Patient carried on JCB: పేషెంట్‌ని జేసీబీలో హాస్పిటల్‌కి తరలింపు.. వీడియో వైరల్


Also Read : Snake Viral Video: అమ్మాయి చెవిలో చిక్కుకున్న పాము, వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook