న్యూఢిల్లీ: బంగారం ధరల్లో సోమవారం భారీగా భారీగా మార్పులొచ్చాయ్. వరసగా రెండు రోజుల నుండి అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి మెరుపులు తగ్గాయి. ముంబై ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 576 రూపాయలు తగ్గి 46,758 రూపాయలకు పడిపోగా, కిలో వెండి 733 రూపాయలు పతనమై 46,957 రూపాయల వద్ద ఆగిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: WhatsAppలో మరో అద్భుతమైన ఫీచర్..


మరోవైపు చైనా రాజధాని బీజింగ్‌లో మరోసారి బారి ఎత్తున కరోనా వైరస్‌ కేసులు వెలుగుచూడటం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల భారీ పతనాన్ని అడ్డుకుందని, అమెరికా సహా పలు దేశాల్లో పాజిటివ్‌ కేసులు పెరగడం పసిడికి ఊతంగా నిలిచాయని బులియన్‌ ట్రేడర్లు అంచనా వేశారు. ఇదిలాఉంటే బంగారం ధరల తగ్గుముఖం తాత్కాలికమేనని అమెరికా-చైనా ఉద్రిక్తతలు, ట్రేడ్‌వార్‌ వ్యవహారంతో బంగారం ధరలు నిలకడగా ముందుకు సాగుతాయని కొటాక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..