Coronavirus Effect: బంగారంపై కరోనా భారం..
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ మార్కెట్ వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఇప్పటికే మాల్స్, బహుళ సముదాయాలు మూతపడ్డాయి. కాగా మరోసారి అనూహ్యంగా బంగారం ధరలు మెరుపువేగంతో పరుగులుపెడుతున్నాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించడంతో
ముంబై: కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచ మార్కెట్ వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఇప్పటికే మాల్స్, బహుళ సముదాయాలు మూతపడ్డాయి. కాగా మరోసారి అనూహ్యంగా బంగారం ధరలు మెరుపువేగంతో పరుగులుపెడుతున్నాయి. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించడంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
Read Also: Rs 2,000 notes printing: రూ.2,000 నోట్ల ప్రింటింగ్ ఆపేశారా ? స్పందించిన కేంద్రం
ఫెడ్ వడ్డీరేట్లలో కోత విధించడంతో బంగారం ధరలు మరోసారి భారీ పెరుగుదలకు దారితీశాయని నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా పదిగ్రాముల బంగారం ధర ముంబైలో 42 వేలకు పైగా నమోదు కాగా, హైదరాబాద్, చెన్నై, విజయవాడ, వైజాగ్ లలో బంగారం ధరలు రూ.42 వేలకు పైగా పెరిగాయని పేర్కొన్నారు.స్వచ్చమైన తులం బంగారంపై రూ.1800 పెరుగుదల నమోదు కాగా, మరోవైపు ఎంసీఎక్స్‌లో సోమవారం ఉదయం పది గ్రాముల బంగారం ఏకంగా రూ. 700 భారమై రూ 41,068కి పెరిగింది.
Read Also: కరోనావైరస్ ఆందోళనల మధ్య బ్యాంకులకు ఆర్బీఐ సూచన
అంతర్జాతీయ మార్కెట్లలోనూ వెండి ధరలు సైతం బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి రూ 338 పెరిగి రూ 40,825కు ఎగబాకింది. కరోనా ప్రభావంతో రానున్న రోజుల్లోనూ బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..