గోపీచంద్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘పంతం’ సినిమా అందరి అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనే టాలీవుడ్ లో చర్చ నడుసస్తోంది. జూలై 5 రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయనే టాక్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ రూమర్స్ కి చెక్ పెట్టేశాడు గోపీంచంద్. ‘పంతం’ రిలీజ్ డేట్ లో ఏ మాత్రం చేంజ్ లేదని తేల్చి చెప్పాడు.


ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. చక్రవర్తి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజర్.రాధా మోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.