Ground Movie: రొటీన్‌కు భిన్నంగా.. నేచురాలిటీకి దగ్గరగా.. గ్రౌండ్ మూవీ అలరించిందా..?
Ground Movie Review and Rating: అందరూ కొత్త నటీనటులతో సూరజ్ తానే దర్శకత్వం వహిస్తూ నిర్మించిన మూవీ గ్రౌండ్. ఒక గ్రౌండ్‌లో జరిగిన సంఘటనను కళ్లకు కట్టేలా ఈ మూవీని తెరకెక్కించారు. మరి ఆడియన్స్‌ను మెప్పించిందా..? రివ్యూలో చూద్దాం..
Ground Movie Review and Rating: ఈ వారం బాక్సాఫీసు వద్ద చిన్న సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం పెద్ద సినిమాలు లేకపోవడంతో వరుసగా చిన్న సినిమాలు థియేటర్లలోకి క్యూకడుతున్నాయి. తాజాగా మరో చిన్న సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. కాన్సెప్ట్ చిన్నదే అయినా.. ప్రేక్షకులను అలరించడంలో ఏ మాత్రం తగ్గేదేలా అంటూ గ్రౌండ్ మూవీ థియేటర్లలో సందడి మొదలు పెట్టింది. సాఫ్ట్‌వేర్ అయిన సూరజ్ తానే.. సినిమాల మీద ఇష్టంతో తానే ప్రొడ్యూసర్‌గా వ్యవరహిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నటీనటులు అందరినీ కూడా కొత్త వాళ్లను తీసుకుని తెరకెక్కించారు. సండే వస్తే చాలు గల్లీలో యూత్ సందడి మాములుగా ఉండదు. బ్యాట్, బాల్ చేతపట్టుకుని గల్లీ క్రికెట్ ఆడుతుంటారు. ఆ కాన్సెప్ట్‌తోనే గ్రౌండ్ మూవీ రూపొందించారు. మరి ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి..
కథ ఏంటంటే..
మన తెలుగు సినిమాలకు రొటిన్‌కు భిన్నంగా ఈ మూవీ స్టోరీని ఎంచుకున్నారు సూరజ్ తానే. ఆదివారం గల్లీ క్రికెట్ ఆడుకునే కుర్రాళ్ల కథను తెరకెక్కించారు. ఆదివారం గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ.. మరో గ్రూప్‌తో ఎదురైన సమస్యను ఎలా పరిష్కరించారని చక్కగా తెరపై చూపించారు. రొటీన్‌కు భిన్నంగా.. నేచురాలిటీగా దగ్గరగా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు మనం కళ్లేదుంటే జరుగుతున్నట్లు అనిపిస్తుంది.
ఎవరు ఎలా నటించారంటే..?
క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా.. హీరోగా హరి, అతని స్నేహితులు చక్కగా నటించారు. అందరూ కొత్త వాళ్లైనా ఎక్కడా తడపాటుకు గురవ్వలేదు. హీరోయిన్‌గా తేజస్విని నటన మెప్పిస్తుంది. తన ఫ్రెండ్ పాత్ర పోషించిన దుర్గా యాక్టింగ్ బాగుంది. చెల్లి క్యారెక్టర్ చేసిన ప్రీతి (చిన్ను), హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నాగరాజు ఆడియన్స్‌ను అలరిస్తారు. ప్రొడ్యూసర్‌గా.. దర్శకుడుగా సూరజ్‌కు మొదటి సినిమా అయినా.. గ్రౌండ్ సినిమాను చక్కగా తెరకెక్కించారు. చిన్న స్టోరీ అయినా.. చాలా నేచురాల్‌గా సీన్స్ తీశారు. భాస్కర్ సంగీతం చక్కగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ పనితీరు కూడా చక్కగా ఉంది.
==> తక్కువనిడివి
==> ప్రతి పాత్రకి ప్రాముఖ్యత
==> కొత్తదనంగా.. రొటీన్‌కు భిన్నంగా చిత్రీకరించారు
==> అయితే అక్కడక్కడ కొంచెం లాగ్ సీన్స్ ఉన్నాయి..
==> ఓవరాల్‌గా యూత్‌కు, గల్లీ క్రికెటర్స్‌కి నచ్చే ఒక మంచి సినిమా
రేటింగ్ :2.75/5
Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే
Also Read: పిల్లల హైట్ కోసం సూపర్ చిట్కా…అది కూడా సహజమైన పద్ధతిలో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter