Natural Ways to Increase Child Height: కొంతమంది పిల్లలు ఊరికే హైట్ పెరుగుతారు మరి కొంతమంది సడన్ గా హైట్ పెరగడం ఆగిపోతారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆందోళనకు గురి అవుతారు .మామూలుగా మన శరీరానికి అవసరమైనటువంటి పోషక విలువలు అందకపోతే అది అభివృద్ధి చెందడం ఆగిపోతుంది. అయితే దీని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు .మనం తీసుకునే ఆహారం, దినచర్య, మన అలవాట్లు ఇలాంటివి ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయి.
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు మంచి ఎత్తు పెరగాలి అనే ఉద్దేశంతో బయట మార్కెట్లో దొరికేటటువంటి కెమికల్స్ తో నిండిన ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. ఇటువంటి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అన్న విషయం వాళ్ళు పట్టించుకోరు. ఫలితంగా చాలా మంది పిల్లలు ఊబకాయం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే మీకోసం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా ఇంటి వద్దనే మన వంటింటిలో లభ్యమయ్యేటటువంటి పదార్థాలను ఉపయోగించి పిల్లల ఎదుగుదల కోసం తయారు చేసే పౌడర్ గురించి తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు వాటి విలువలు:
బయట మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్ తో పోల్చుకుంటే మనం ఇంటి వద్దనే చేసుకుని ఈ పౌడర్ వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు .మరి వీటికి కావలసిన పదార్థాలు వాటి గుణాలు తెలుసుకుందాం..
నువ్వులు : చాలామంది నువ్వులు తినడానికి ఇష్టపడరు. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ-ఆక్సిడెంట్ మన జీవ క్రియ మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది మన శరీరానికి అవసరమైనటువంటి క్యాల్షియంని అందించడంతో పాటు ఎముకలను పుష్టిగా చేస్తాయి. నువ్వులు పిల్లల ఎదుగుదలకు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
మఖానా : ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్న ఈ మఖాన తినడం వల్ల శరీరానికి అవసరమైనటువంటి క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. ఇది బోన్ డెన్సిటీని పెంచడంతోపాటు పిల్లల ఎముకలను బలపరుస్తుంది.
బాదం: బాదం పప్పులు తినడం వల్ల మెదడు ఉత్తేజం అవడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బాదంపప్పులు పిల్లల యొక్క శారీరక అభివృద్ధి కూడా ఎంతో మేలు చేస్తాయి.
సోంపు: ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి సోంపు మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్, మెగ్నీషియం ,పొటాషియం, కాల్షియం లాంటివి ఎన్నో పుష్కలంగా లభిస్తాయి.
పౌడర్ తయారీ:
పిల్లలు ఆరోగ్యంగా సహజంగా ఎత్తు పెరగడానికి ఉపయోగించేటటువంటి పౌడర్ను తయారు చేయడానికి కావలసిన సరుకులు ఏమిటో తెలుసుకున్నాం మరి తయారీ విధానం ఏమిటో చూద్దాం.. ముందుగా 50 గ్రాముల నువ్వులు, 200 గ్రాముల మఖానా, బాదం పప్పులు 100 గ్రాముల ,సోంపు 100 గ్రాముల చొప్పున తీసుకుని బాండలిలో సన్నని సెగపై బాగా వేయించాలి. కాస్త చల్లారిన తర్వాత దీన్ని మెత్తటి పొడిగా చేసుకొని జల్లించి డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రోజు వేడి పాలలో ఒక చెంచా కలిపి పిల్లలకు ఇవ్వవచ్చు.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది. పైన చెప్పిన వస్తువులను తీసుకునే ముందు మీకు ఫుడ్ ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడం మంచిది.
Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్ స్కామ్‌లో కవిత అరెస్ట్ తప్పదా?
Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్, రుణమాఫీ ఎప్పటినుంచంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook