ముంబై: కరోనా మహమ్మారి దాపరించి ఉన్న విపత్కర పరిస్థితుల్లో ఓ హెయిర్ సెలూన్ యజమాని గొప్ప మానవత్వాన్ని చాటుకున్నాడు. ముంబైలోని ఓ సెలూన్ యజమాని రోడ్డు పక్కన నివసించే వీది బాలలకు, పేద పిల్లలకు ఉచితంగా జుట్టు కత్తిరించి లాక్ డౌన్ కాలంలో తనవంతు సహకారాన్ని అందిస్తున్నాడు. అయితే ముంబైలోని రవీంద్ర బిరారి అనే క్షౌర చేసే వ్యక్తి టిట్వాలాలో నివాసముండగా భండూప్‌లో చాలా సంవత్సరాల నుండి సొంతంగా సెలూన్లో వృత్తిని కొనసాగిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : BRKR Bhavan: తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం 
కాగా గత రెండు నెలల నుండి లాక్ డౌన్ ప్రకటించిన నాటి నుండి అన్నీ సెలూన్లు మూసివేయబడ్డ సంగతి తెలిసిందే. రహదారికి ఇరువైపులా నివసించే పేద పిల్లలు జుట్టు కత్తిరించుకోవడానికి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు. వారు అంతా ఖర్చు పెట్టలేరని, కాబట్టి నేను ఆ పిల్లలకు ఉచితంగా క్షౌరం చేస్తున్నానని  బిరారి ANIతో వెల్లడించారు. 


Read also : Monsoon updates: కేరళను తాకిన రుతుపవనాలు.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు


ఆశ్చ్యర్యకరంగా ఓ బాలుడు స్పందిస్తూ జుట్టు కత్తిరించిన తరువాత అంకుల్ చాలా బాగుందన్నాడు. లాక్డౌన్ వల్ల సెలూన్లు తెరవాలేదని మా దగ్గరకు వచ్చి ఉచితంగా కట్టింగ్ చేసినందుకు ధన్యవాదాలన్నాడు. 
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..