BRKR Bhavan: తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం

Telangana secretariat| హైదరాబాద్: తెలంగాణకు తాత్కాలిక సచివాలయంగా పనిచేస్తోన్న బూర్గుల రామకృష్ణా రావు భవన్‌లో ( BRKR Bhavan ) కరోనావైరస్ కలకలంరేపింది. బిఆర్‌కెఆర్ భవన్‌లోని 8వ అంతస్తులో అటెండర్, ఆఫీస్ బాయ్‌గా సేవలు అందిస్తున్న ఇద్దరికి కరోనావైరస్ సోకినట్టు ( COVID-19) తెలుస్తోంది. కరోనావైరస్ బారిన పడిన ఇద్దరూ తండ్రీకొడుకులేనని సమాచారం.

Last Updated : Jun 8, 2020, 01:40 PM IST
BRKR Bhavan: తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం

Telangana secretariat| హైదరాబాద్: తెలంగాణకు తాత్కాలిక సచివాలయంగా పనిచేస్తోన్న బూర్గుల రామకృష్ణా రావు భవన్‌లో ( BRKR Bhavan ) కరోనావైరస్ కలకలంరేపింది. బిఆర్‌కెఆర్ భవన్‌లోని 8వ అంతస్తులో అటెండర్, ఆఫీస్ బాయ్‌గా సేవలు అందిస్తున్న ఇద్దరికి కరోనావైరస్ సోకినట్టు ( COVID-19) తెలుస్తోంది. కోవిడ్-19 బారిన పడిన ఇద్దరూ తండ్రీకొడుకులేనని సమాచారం. గతేడాది ఆగస్టులోనే తెలంగాణ సచివాలయం తాత్కాలికంగా బి.ఆర్.కే.ఆర్ భవన్‌కి మార్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సచివాలయంలోని కీలక శాఖలన్నీ బిఆర్‌కేఆర్ భవన్ వేదికగానే పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సైతం అక్కడి నుంచి విధులు నిర్వహిస్తున్నారు. Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )

తెలంగాణ సీఎంఓలో ఇటీవల ఒక ఉద్యోగికి కరోనా సోకిన అనంతరం శానిటైజేషన్ నిమిత్తం సీఎంఓను సీజ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ కూడా బి.ఆర్.కె.ఆర్ భవన్ నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో 8వ అంతస్తులోని సిబ్బందికి కరోనా సోకిందనే వార్తలు భవన్‌లోని సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News