Thika Maka Thanda Movie Release Date: ఇంట్లో ఒకరికి మతిమరపు ఉంటేనే ఎలానో ఉంటుంది. అలాంటిది ఆ ఊర్లోదంరికీ మతిమరుపు ఉంటే..? ఊహించుకోవడానికే చాలా కొత్తగా ఉంది కదా.. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీనే 'తికమకతాండ'. ఊర్లో అమ్మవారి విగ్రహం మాయమవడం చుట్టూ కథ తిరుగుతుంది. మతిమరుపుతో ఉన్న ఆ ఊరి ప్రజలు అమ్మవారి విగ్రహాన్ని కనిపెట్టారా లేదా అనేది కథాంశం. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. హరికృష్ణ, రామకృష్ణ , యాని , రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ, యాదమ రాజు, భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రేపు (డిసెంబర్ 15న) ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతోంది. వెంకట్ దర్శకత్వం వహించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ట్విన్స్ రామ్ హరి హీరోలుగా ఒక కొత్త ప్రయోగంతో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలిపారు. డైరెక్టర్ వెంకట్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను నిర్మించామని చెప్పారు. ఊరందరికీ మతిమరుపు అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని.. గ్రామంలో ప్రజలు పడే ఇబ్బందులు, బాధలు ఎలా ఉంటాయనేది తెరపై చక్కగా చూపించామన్నారు. మతిమరుపుతో ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో మనందరికీ తెలుసు అని.. కామెడీగా ఉంటూనే మంచి ఎమోషన్ కంటెంట్ ఉన్న సినిమా అని చెప్పారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాజన్న సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యాని, రేఖా నిరోష హీరోయిన్లుగా నటించారని తెలిపారు. రేపు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు తెలిపారు. 


అనంతరం డైరెక్టర్ వెంకట్ మాట్లాడుతూ.. కథను నమ్మి తనకు అవకాశం ఇచ్చిన నిర్మాత తిరుపతి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హీరోలు హరికృష్ణ, రామకృష్ణ, హీరోయిన్లు యాని, రేఖ చాలా బాగా నటించారని చెప్పారు. సంగీతం చాలా వచ్చిందని.. సిద్ శ్రీరామ్ పాడిన పాట మూవీకి హైలెట్‌గా నిలుస్తుందన్నారు. తెలంగాణలోని ఓ గ్రామంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమా షూటింగ్ నిర్వహించామన్నారు. రేపు థియేటర్లలో ప్రేక్షకులు చూసి మంచి విజయాన్ని అందివ్వాలని కోరారు. డీఓపీగా హరికృష్ణన్ వర్క్ చేయగా.. ఎడిటర్‌గా కుమార్ నిర్మలాసృజన్ పనిచేశారు.


Also Read:  Ind-vs-SA: భారత్-దక్షిణాఫ్రికా చివరి టీ20 నేడే, సిరీస్ సమం అవుతుందా లేదా


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి