HBD Thalapathy Vijay: దళపతి విజయ్ బర్త్ డే.. `లియో` ఫస్ట్ లుక్ అదుర్స్.. ఊరమాస్!
Thalapathy Vijay `Leo` Movie First Look: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా లియో. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల మందుకు రానుంది.
Thalapathy Vijay- Lokesh Kanagaraj Combo Movie Leo First Look: ఇవాళ దళపతి విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'లియో' చిత్రం నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదల చేసిన లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో విజయ్ సుత్తి పట్టుకొని విలన్స్ ఫైట్ చేస్తున్నట్లు చూపించారు. అతని పక్కనే తోడేలు కోపంగా ఉండటం కనిపిస్తుంది. విజయ్ మాస్ లుక్ పై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది 'కోలీవుడ్ సినిమానా లేక హాలీవుడ్‌నా' అని అంటుంటే... మరికొందరు 'హాలీవుడ్ కంటే బాగుందని' రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'మాస్టార్ 'సినిమా వచ్చింది. ఇది ఎంత సూపర్ హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. లియో సినిమాలో త్రిష, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ చేయబోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
ఈ మూవీ రిలీజ్ కు ముందే భారీగా బిజినెస్ చేసింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్, ఓవర్సీస్ రైట్స్ రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా రైట్స్ తెలుగులో రూ.25 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. తెలుగులో లోకేష్ కనగరాజ్ కు ఉన్న డిమాండ్ కారణంగా ఈ ధరకు కారణమని తెలుస్తోంది.
రీసెంట్ గా నాగ చైతన్యతో కస్టడీ (Custody) సినిమా తీసిన వెంకట్ ప్రభుతో (Venkat Prabhu) తన కొత్త సినిమాను ప్రకటించారు దళపతి. ఈ చిత్రాన్ని ఎ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కళపతి ఎస్. అఘోరం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి యువన్ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం విజయ్ కి రూ.200 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారనే వార్త సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.
Also Read: Varun Sandesh: హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు, కానిస్టేబుల్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook