కీరాదోస వల్లే కలిగే ప్రయోజనాలెన్నో..
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హడలెత్తిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హడలెత్తిస్తున్నాయి. బయట తిరగాలంటేనే జనాలు భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాలనుకొనే వారు ఎండ నుంచి రక్షించుకొనేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. వాటిల్లో కీరదోస కూడా ఒకటి. ఇది సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా దొరుకుతుంది. కీరదోస వల్ల మన శరీరానికి చల్లదనం వస్తుంది. ఇందులో పోషకాలు ఉండడం వల్ల శరీరం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటుంది. ఇలా మరెన్నో ప్రయోజనాలు కీరదోసలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
కీరదోస వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. శరీరానికి చల్లదనం కలుగుతుంది.
కీరదోసలను అడ్డంగా ముక్కలుగా కోసి వాటిని కళ్లమీద పెట్టుకుంటే..కళ్ల కింద ఉండే నల్లని వలయాలు పోతాయి.
చర్మానికి అవసరమైన విటమిన్ సి లభిస్తుంది. సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి మనకు రక్షణ కలుగుతుంది.
క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసే గుణాలు కీరదోసలో పుష్కలంగా ఉన్నాయి.
రోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని కీరదోస ముక్కలు తినడంవల్ల తలనొప్పి ఉండదు.
ప్రతిరోజూ కొన్ని కీర ముక్కల్ని తినడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలోని మలినాలు కూడా తొలగిపోతాయి.