చలికాలంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు చాలా ఉంటాయి. చలికాలంలో వాతావరణం, జీవనశైలి మారడం వల్ల శరీరంలో చాలా సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా చేతులు, కాళ్ల  నరాలు పట్టేస్తుంటాయి. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామందికి చలికాలంలో నరాల పట్టేయడం, టింగ్లింగ్ వంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య తలెత్తినప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. ఇది ఆరోగ్యంపై పెను ప్రభావం చూపించవచ్చు. శరీరంలో పోషకాల లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఈ విధమైన సమస్య ఏర్పడినప్పుడు ఎలాంటి విటమిన్ లోపం ఉంటుంది, ఎలా దూరం చేయాలో తెలుసుకుందాం.


చలికాలంలో సహజంగా నరాలు పట్టేసినట్టుండటం, టింగ్లింగ్ సెన్సేషన్, మెమరీ పవర్ తగ్గడం వంటి లక్షణాలు కన్పిస్తుంటాయి. వీటికి కారణం విటమిన్ బి12 లోపమే. ఈ విటమిన్ బి 12 అనేది శరీరంలో చాలా పనులకు అవసరమైంది. శరీరంలో విటమిన్ బి12 లోపంతో చాలా వ్యాధులు తలెత్తుతాయి. విటమిన్ బి12 మజిల్స్, రక్త నాళాల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి. విటమిన్ బి 12 అనేది నరాలకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. శరీరంలో విటమిన్ బి12 లోపంతో నరాలు డ్యామేజ్ అయ్యే ముప్పు పెరుగుతుంది.


మెదడుపై ప్రభావం


విటమిన్ బి12 మన మెదడులో మైలిన్ తయారీలో ఉపయోగపడుతుంది. విటమిన్ బి12 లోపముంటే ఈ పదార్ధాలు తయారీ కష్టమౌతుంది. విటమిన్ బి12 లోపంతో మెదడుపై ప్రభావం పడవచ్చు. జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.


రక్త హీనత


విటిమిన్ బి12 ఎర్ర రక్త కణాల నిర్మాణంలో ఉపయోగపడుతుంది. శరీరంలో విటమిన్ బి 12 లోపముంటే..రక్తం సరిగ్గా ఏర్పడదు. ఫలితంగా రక్త హీనత తలెత్తుతుంది. విటమిన్ బి 12 లోపం సాధారణంగా ఎనీమియా కారణంగా వస్తుంది.


శ్వాస వ్యాధులు


విటమిన్ బి12 లోపంతో ఊపిరితిత్తులపై ప్రభావం పడవచ్చు. విటమిన్ బి12 లోపం కారణంగా శ్వాసలో ఇబ్బందులు రావచ్చు. అయితే సరైన డైట్ తీసుకోవడం ద్వారా విటమిన్ బి12 లోపాన్ని సరిచేయవచ్చు. మాంసం, చేపల్లో విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. ట్రూనా, శీలావతి చేపల్లో విటమిన్ బి12 ఎక్కువగా లభిస్తుంది. ఇవి కాకుండా పాల ఉత్పత్తుల ద్వారా విటమిన్ బి12 పొందవచ్చు. 


Also read: Turmeric milk: పసుపు పాలు రోజూ తాగితే ఈ వ్యాధులన్నీ నెలరోజుల్లో మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook