`ఇ` విటమిన్ ఆరోగ్యానికెంతో మేలు
కొన్ని రకాల వంటనూనెలు, పొద్దుతిరుగుడు, గుడ్డులోని పచ్చ సోన, ఆకుకూరల్లో, తృణధాన్యాల్లో ఎక్కువగా ఉండే విటమిన్ ఇ వల్ల ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు అంటున్నారు.
కొన్ని రకాల వంటనూనెలు, పొద్దుతిరుగుడు, గుడ్డులోని పచ్చ సోన, ఆకుకూరల్లో, తృణధాన్యాల్లో ఎక్కువగా ఉండే విటమిన్ 'ఇ' వల్ల ఆరోగ్యానికెంతో మేలని నిపుణులు అంటున్నారు.
- విటమిన్ 'ఇ' శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలోని కణాలను ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది.
- 'ఇ' విటమిన్ ఉన్న పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. హానికారక క్రిములు, క్యాన్సర్ కణాల బారిన పడకుండా రక్షిస్తుంది.
- శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి శరీరాన్నీ ఆరోగ్యంగా మారుస్తుంది. మడతలు, చర్మం పొడిబారడం లాంటి సమస్యలు అదుపులోకి వస్తాయి.
- చూపు మందగించడం, అల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే 'ఇ' విటమిన్‌ని ఎక్కువగా తీసుకోవాలి.
- విటమిన్ 'ఇ'ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండెపోటుతో పాటు హృద్రోగ సమస్యలు దూరమవుతాయి. అధిక బరువూ తగ్గుతుంది.
- ఒత్తిడి తట్టుకునేందుకు 'ఇ' విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది.
- ఇ' విటమిన్ ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మెటబాలిజమ్ సమస్యలు, మధుమేహ సమస్యలు దగ్గరకి రావు.