సాగరతీరంలో చల్లగాలికి బదులుగా ఒక్కసారిగా విషగాలి వీచింది. పరిశ్రమ నుంచి విష వాయువు విడుదల కావడంతో విశాఖపట్నంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. విష వాయువులు పీల్చిన ఘటనలో ఇప్పటివరకూ 8 మంది మరణించగా, దాదాపు వెయ్యి మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. విశాఖ ఘటనపై టాలీవుడ్ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో జోష్.. పెరిగిన బంగారం ధరలు 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘విశాఖలో విషవాయువు స్టెరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురైన  వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. లాక్‌డౌన్ తర్వాత తెరుస్తున్న పరిశ్రమల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారో లేదో అధికారులు పరిశీలించాలని’ మెగాస్టార్ చిరంజీవి కోరారు. విమాన ప్రయాణికులకు ఎయిరిండియా శుభవార్త



విశాఖ గ్యాస్ లీక్ ఘటన వినగానే గుండె బద్ధలైంది. ఇది చాలా కష్ట కాలమని భావిస్తున్నాను. చనిపోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఆస్పత్రిలో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తాను. వైజాగ్ సురక్షితంగా ఉండాలంటూ’ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. బికినీలో అమెరికన్ అందం హాట్ పోజులు



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!