Nithin Macharla Dhamki: హీరో నితిన్ అప్‌కమింగ్ మూవీ 'మాచర్ల నియోజకవర్గం' నుంచి ధమ్కీ పేరిట ట్రైలర్ ప్రోమో విడుదలైంది. సింగిల్‌ డైలాగ్‌తో కట్ చేసిన ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. 'మహాభారతంలో ధర్మాన్ని కాపాడేందుకు లక్షలాది మంది తమ సమాధులను పునాదులుగా వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని రక్షించడం కోసం నా సమాధాని పునాదిగా వేసేందుకు నేను సిద్ధం..' అంటూ నితిన్ చెప్పిన ఇంటెన్స్ డైలాగ్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటిదాకా ఒక ఎత్తు.. ఇకపై ఒక ఎత్తు.. ఈ ధమ్కీ వీడియో చూశాక సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందనే విషయం అర్థమవుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 30న సాయంత్రం 5 గంటలకు గుంటూరులో విడుదల చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాచర్ల నియోజకవర్గం టీజర్, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ప్రోమోతో సినిమాపై అంచనాలు పెరిగాయి. చాలాకాలంగా సరైన బ్రేక్ లేక ఇబ్బందిపడుతున్న నితిన్‌కి ఈ సినిమాతో హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. గతేడాది ఏకంగా 3 సినిమాలు రిలీజ్ చేసినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంపై నితిన్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు. 


పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాస్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నితిన్ కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డి పాత్రలో కనిపించనున్నాడు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థెరిసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: Monkeypox Symptoms: భారత్‌లో పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి!  


Also Read: Nandamuri Balakrishna: బాలకృష్ణ వీడియోలు బయటకు.. బాబు బంగారం అంటూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.