Veekshanam Movie: రామ్ కార్తీక్, క‌శ్వి జంటగా మనోజ్ పల్లేటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ వీక్షణం. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాను ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి.పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి కావడంతో ఈ నెల 18న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా యంగ్ హీరో రామ్ కార్తీక్ మూవీ విశేషాలను మీడియాతో పంచుకున్నారు. డైరెక్టర్ మనోజ్ పల్లేటి వీక్షణం స్క్రిప్ట్‌ చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందని చెప్పారు. తాను ఇప్పటివరకు విన్న కథలో డిఫరెంట్ ఫీలింగ్ కలిగించిందన్నారు. వీక్షణం కథ వినే సమయంలో తరువాత ఏం జరుగుతుందో ఊహించలేకపోయానని.. ప్రీ క్లైమాక్స్‌తోాటు హుక్‌ సీన్స్ ఉంటాయన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఈ మూవీ నేను సరదాగా ఉండే కుర్రాడి పాత్రలో నటించా. ఈ కుర్రోడికి పక్కోడి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్‌తో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనదే మూవీలో మెయిన్ పాయింట్. ఆ యువకుడి జీవితంలోకి అమ్మాయి రావడంతో కథ మలుపులు తిరుగుతుంది. అప్పటివరకు సరదాగా ఉండే యువకుడి జీవితంలో సీరియస్‌నెస్ పెరుగుతుంది. డిటెక్టివ్‌లా మారి తన చుట్టు జరుగుతున్న విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు.


లవ్ స్టోరీతో మొదలై.. మిస్టరీ థ్రిల్లర్‌గా మారుతుంది. నేను గతంలో థ్రిల్లర్స్ చేశాను. కానీ మిస్టరీ థ్రిల్లర్‌లో నటించడం ఫస్ట్ టైమ్. మొదట్లో ఈ ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు డైరెక్టర్ మనోజ్ చాలా కష్టపడ్డారు. ప్రొడ్యూసర్ అశోక్, మనోజ్ ఇద్దరు ఒకే ఊరు కావడంతో కథ నచ్చి సినిమా మొదలుపెట్టారు. థ్రిల్లర్ అంటే మైండ్ గేమ్‌. ఆడియన్స్‌ను చివరివరకు ఎంగేజ్ చేయగలితే మూవీ సక్సెస్ అవుతుంది. డైరెక్టర్ మనోజ్ స్క్రిప్ట్‌కు వివిధ రకాల వెర్షన్స్‌ రాసుకున్నారు. స్క్రీన్‌ప్లేలో హుక్ పాయింట్స్ ఉండేలా చూసుకున్నారు. కథకు సరిగ్గా సరిపోయే టైటిల్. ప్రీక్లైమాక్స్ అసలు ఎవరూ ఊహించలేరు. భయపెడుతూనే ఎలా అధికమించాలో ఈ సినిమా చూపిస్తుంది. ఈ మూవీ నన్ను హీరోగా మరో మెట్టు ఎక్కిస్తుందని అనుకుంటున్నా. వాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. మరిన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయి.." అని రామ్ కార్తీక్ చెప్పుకొచ్చారు.