Thika Maka Thanda Review: తికమకతాండ సినిమా రివ్యూ..ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందంటే..
Thika Maka Thanda Review: బ్యూటిఫుల్ కామెడీ ఎంటర్టైనర్ తికమకతాండ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో రామకృష్ణ హరికృష్ణ లు హీరోలుగా నటించగా టి ఎస్ ఆర్ మూవీ మేకర్ సంస్థ తెరకెక్కించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Thika Maka Thanda Review: ట్విన్స్ హీరోలు రామకృష్ణ హరికృష్ణ, హీరోయిన్స్ యానిరేఖ నిరోషాతో వెంకటేష్ డైరెక్షన్ లో నిర్మించిన చిత్రం తికమకతాండ. ఈ చిత్రాన్ని టిఎస్ఆర్ మూవీకి మేకర్ సంస్థపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వంగా వహించిన వెంకట్ గతంలో గౌతమ్ మీనన్, విక్రమ్ కే కుమార్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు. ఊరందరికీ మతిమరుపు అనే అంశంతో ముందుకు వచ్చిన కథని ఈ తికమకతాండ. ఈ చిత్రాన్ని తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతంలోని ఓ అందమైన గ్రామీణ వాతావరణం లో చిత్రాన్ని నిర్మించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
కథ:
ఈ సినిమాలో తికమకతాండ అనే ఊరిలో ప్రతి ఒక్కరికి మతిమరుపు అనే సమస్య ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి అమ్మవారి జాతర చేద్దామని ఊరి ప్రజలు అనుకుంటారు. ఇంతలోనే ఆ అమ్మవారి విగ్రహం మాయమైపోతుంది. అయితే ఈ విగ్రహాన్ని ఎవరు తీసుకెళ్లారు విగ్రహాన్ని తీసుకురావడానికి ఊరి ప్రజలతో పాటు హీరోలు పడ్డ కష్టాలేంటి అనే అంశమే తికమకతాండా సినిమా..
ఈ తికమకతండా సినిమాలోని నటుల విషయానికొస్తే.. హరికృష్ణ రామకృష్ణ ఇద్దరు ట్విన్స్ ఫస్ట్ మూవీ అయినప్పటికీ ఎంతో అద్భుతంగా నటించారు ఈ సినిమాలో వీరిద్దరూ డాన్సులు ఫైట్లు పరంగా ఏమాత్రం వెనకాడ లేరు. గతంలో ఫైట్ మాస్టర్ రాము లక్ష్మణ్ సినిమా ఇండస్ట్రీకి ఎలా పరిచయమయ్యారో సేమ్ అలాగే.. హీరోలుగా ఈ సినిమా ద్వారా హరికృష్ణ రామకృష్ణాలు పరిచయమయ్యారు.
రాజన్న సినిమాలో మల్లమ్మ పాత్ర పోషించిన నటి ఈ సినిమాలో మల్లికగా పరిచయమైంది. విలేజ్ అమ్మాయిగా నటించి అద్భుతమైన పర్ఫామెన్స్ అందించింది. ఇక ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ అన్ని ఇరగదీశారు. ఓహో పుత్తడి బొమ్మ సాంగ్ మాత్రం అందరికీ ఎంతగానో నచ్చుతుంది ఈ సినిమాకు మరో హీరోయిన్గా రేఖ నిరోషా పరిచయమవుతుంది. ఆమె పాత్ర చాలా తక్కువ అయినప్పటికీ యాక్టింగ్ పరంగా ఎక్కడ వెనకాడ లేదు. ఈ సినిమాలో శివ నారాయణ, బుల్లెట్ భాస్కర్, యాదవరాజు కీలకపాత్రలో కనిపిస్తూ పర్ఫామెన్స్ ను ఇరగదీశారు.
డైరెక్టర్ వెంకట్ ఎంచుకున్న స్టోరీని నమ్మి నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు టెక్నికల్ వాల్యూస్తో ఏమాత్రం తగ్గకుండా మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో డిఓపి హరికృష్ణన్ ఫోటోగ్రఫీ ఎంతో బాగుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్.. ఓహో పుత్తడి బొమ్మ సాంగ్ తో సిద్ శ్రీరామ్ సినిమాకు మంచి హైలెట్ అందించారు. ఈ సినిమాలో లొకేషన్స్, యాక్టర్స్ అందరూ ఎంతో సహస్సితంగా కనిపిస్తారు.
రేటింగ్: 2.7
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి