న్యూడిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనావైరస్ ఇప్పటికే లక్షలాది మందికి సోకింది. మీరు చేసే అజాగ్రత్తల వల్ల వ్యాప్తి తీవ్రతరమవుతోందని మీకు తెలుసా? సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన ప్రచారం కలిపిస్తున్నప్పటికీ మీరు అనుకోకుండా కొన్ని తప్పులు చేస్తూనే ఉన్నారు. కాగా కరోనాపై కొన్ని సూచనలు మీకోసం..  
 
1. కరచాలనం వద్దు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా మీరు ఎవరినైనా కలిసేటప్పుడు కరచాలనం చేసే ముందు ఆలోచించాలి. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అతిపెద్ద కారణం కరచాలనమే. యుఎస్, ఇటలీ వంటి దేశాలలో కరోనావైరస్ వ్యాప్తి చెందడానికి అతిపెద్ద కారణం వారి షేక్ హ్యాండ్,  కౌగిలింతలు. ఈ కారణంగా, యూరోపియన్ దేశాల్లోని ప్రభుత్వాలు ఈ సంస్కృతికి స్వస్తి చెప్పాలని, వినయ సంస్కృతిని అవలంబించాలని కోరాయి. ఈ సమయంలో మీరు ఎవరినైనా కలిసినప్పుడు చేతులు జోడించి నమస్కరించాలని సలహా ఇస్తున్నారు.


Read Also: CBSE బోర్డ్ ఎగ్జామ్స్ వాయిదా 
 
2. తుమ్ముతున్నప్పుడు చేతులు ఉపయోగించవద్దు


కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తిపై ఇప్పటికే చాలా వరకు అవగాహన కల్పించాం. కాగా తుమ్ముతున్నప్పుడు గుడ్డ వాడాలని, పొరపాటున కూడా మీరు తుమ్మినప్పుడు చేతిని తాకవద్దని వైద్యులు సలహా ఇస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేతులను దూరంగా ఉంచాలని, తుమ్ముతున్నప్పుడు మనకు తెలియకుండానే అకస్మాత్తుగా చేతులు ముఖం దగ్గరకు వెళతాయని ఈ సమయంలో జాగ్రత్త వహించాలని లేకపోతే వైరస్ ప్రభావితమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


Also: నిర్భయ దోషులకు రేపే ఉరి..!!
  
వైరస్ కనిపించదని, ముందు జాగ్రత్తలు తప్పనిసరని జలుబు, ఛాతి నొప్పి, కళ్ళ నుండి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గర్లోని వైద్యుడిని సంప్రదించాలని, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.కె. స్పందిస్తూ వైరస్ వ్యాప్తి, దాని వల్ల వచ్చే ప్రమాదంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..