నిర్భయ కేసులో దోషులకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. వారికి రేపే ఉరి శిక్ష అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తీహార్ జైలు ఉన్నతాధికారులు ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
నిర్భయ కేసులో చివరి అంకానికి అంతా దగ్గరపడింది. రేపు తెల్లవారుజామున 5.30 గంటలకు వారికి ఉరి శిక్ష అమలు జరిగేందుకు ఏర్పాట్లు ముమ్మరం అవుతున్నాయి. సుప్రీం కోర్టు ఇవాళ పవన్ గుప్తా పిటిషన్ కొట్టివేయడం.. మిగతా ఇద్దరు నిందితుల క్షమాభిక్ష పిటిషన్లను కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో నలుగురు నిందితులకు రేపే ఉరి శిక్ష అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read Also: సీఆర్పీఎఫ్ ఎస్ఐ ఆత్మహత్య
ఈరోజు నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వారి ఆరోగ్య పరిస్థితి అంతా బాగుందని నిర్ధారించుకున్న తర్వాత.. నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పిస్తారు. సుప్రీం ఆదేశాల ప్రకారం రేపు (శుక్రవారం) తెల్లవారుజామున ఉరి శిక్ష అమలు చేస్తారు. నలుగురు దోషులకు ఒకేసారి శిక్ష అమలు చేయాలని ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానం ఫైనల్ డెత్ వారెంట్ జారీ చేసింది.
మరోవైపు నిర్భయ దోషుల్లో ఒకరైన ముఖేష్ సింగ్.. ఢిల్లీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై మధ్యాహ్నం 2.30 గంటలకు కోర్టు విచారణ చేయనుంది.
ఇవాళ కోర్టులో జరిగిన పరిణామాలతోపాటు, నిర్భయ కేసులో మిగతా పరిణామాలపై నిర్భయ తల్లి ఆశాదేవి హర్షం వ్యక్తం చేశారు. రేపు నిర్భయకు న్యాయం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.