వయసు పైబడిన సీని ప్రముఖులు ఎవరో ఒకరు చనిపోయారంటూ తరచుగా వదంతులు ప్రచారం అవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా మరో దిగ్గజ నటిని నెటిజన్లు చంపేశారు. దీనిపై సీనియర్ నటి దీటుగానే స్పందించారు. తాను ఇంకా బతికే ఉన్నానని చంపేయవద్దంటూ సోషల్ మీడియా ద్వారా వదంతులకు చెక్ పెట్టారు.  Photos: రానా, మిహికా రోకా వేడుక.. ఫొటో గ్యాలరీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ దిగ్గజ నటి ముంతాజ్ చనిపోయారని ఇటీవల కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోలు సైతం షేర్ చేసి కొందరు సంతాపం తెలిపారు. దీనిపై దిగ్గజ నటి ముంతాజ్ ఘాటుగా స్పందించారు. కుమార్తె తన్యా మధ్వాని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి వీడియో పోస్ట్ చేశారు. అలనాటి హీరోయిన్లతో సెక్సీ హీరోయిన్, రొమాన్స్ పండించడంతో దిట్టగా ఆమె ప్రసిద్ధి గాంచారు. పాత తరం వారికి ఆమె సుపరిచితురాలు.


[[{"fid":"185974","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photo: Still From Tangewala","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photo: Still From Tangewala","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Photo: Still From Tangewala","class":"media-element file-default","data-delta":"1"}}]]


టాంగేవాలా సినిమాలో ‘రొమాన్స్ క్వీన్’ ముంతాజ్ (పాత ఫొటో)



‘నేను చనిపోలేదు. బతికే ఉన్నాను. ఆ వదంతులు నమ్మవద్దని’ తన అభిమానులకు ముంతాజ్ సూచించారు. గతంలో తన తల్లి క్యాన్సర్‌తో పోరాడుతున్న ఫొటోలను షేర్ చేసి మా అమ్మ ముంతాజ్ చనిపోయారంటూ దుష్ప్రచారం చేశారని తన్యా మధ్వాని తెలిపారు. ఆమె వయసు 73 ఏళ్లు. ఆమె ఇప్పటికీ చాలా సంతోషంగానూ, అందంగానూ ఉన్నారు. ఆమెకు ఎవరైనా బ్రేక్ ఇస్తారా అని తన్యా అడిగారు. బాలనటిగా సినిమాల్లోకి వచ్చిన ముంతాజ్ ఆపై హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్