బి. నాగిరెడ్డి పోస్టల్ స్టాంపు విడుదల
విజయావాహినీ బ్యానర్ పై పలు అద్భుత కళాఖండాలను నిర్మించిన ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దివంగత బి.నాగిరెడ్డి స్మారకార్థం పోస్టల్ శాఖ ఓ తపాలా స్టాంపును విడుదల చేసింది.
విజయావాహినీ బ్యానర్ పై పలు అద్భుత కళాఖండాలను నిర్మించిన ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దివంగత బి.నాగిరెడ్డి స్మారకార్థం పోస్టల్ శాఖ ఓ తపాలా స్టాంపును విడుదల చేసింది. చెన్నైలో ఫిబ్రవరి 23, 2018న జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పోస్టల్ స్టాంపును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బి.నాగిరెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (డిసెంబర్ 2, 1912 - 25 ఫిబ్రవరి 2004) చెన్నైలో విజయావాహినీ స్టూడియోని స్థాపించారు. ఇది ఆసియాలోని అతి పెద్ద చలనచిత్ర స్టూడియో. నాగిరెడ్డి నిర్మించిన కొన్ని సినిమాలలో పాతాళభైరవి(1951), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), గుండమ్మ కథ (1962), మదువే మదినోడు (1965-కన్నడ), రామ్ ఔర్ శ్యామ్, శ్రీమాన్ శ్రీమతి, జూలీ (1975), స్వర్గ్ నారక్ (1978) వంటి హిందీ చిత్రాలు ప్రసిద్ధి చెందాయి. బి.నాగిరెడ్డి 1960-61,1962-63లో రెండుసార్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా పనిచేశారు. 1987లో ఈయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.