Railway Ticket New Rules: రైల్వే టికెట్లకు సంబంధించి ఐఆర్సీటీసీ మరో మార్పు చేసింది. ఈ మార్పు కారణంగా కన్ఫామ్ తత్కాల్ టికెట్ పొందడంలో ఏ విధమైన ఇబ్బంది ఉండదిక.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్వేలో సుఖమైన ప్రయాణం కావాలంటే ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకోవాలి. కానీ అన్నిసార్లు ఇది సాధ్యం కాదు. ఒక్కోసారి హఠాత్తుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. రైల్వే స్టేషన్‌లో అప్పటికప్పుడు టికెట్ కొనుగోలు చేయడమో లేదా తత్కాల్ కోసం ప్రయత్నించడమో చేయాల్సి వస్తుంది. అయితే తత్కాల్ టికెట్ లభ్యత అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుంది. తత్కాల్ టికెట్ నిర్ధారణ కాకపోవచ్చు. వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీలో ఉండొచ్చు. 


ఇప్పుడు ఐఆర్సీటీసీ, భారతీయ రైల్వే కొన్ని మార్పులు చేశాయి. కన్ఫామ్ రైలు టికెట్ల బుకింగ్ విషయంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పుల కారణంగా తత్కాల్ టికెట్ బుకింగ్ చేసే సమయంలో, కన్ఫామ్ తత్కాల్ టికెట్ పొందే విషయంలో ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకావు.


భారతీయ రైల్వే, ఐఆర్సీటీసీలు కలిసి టికెట్ బుకింగ్ ఆప్షన్‌లో కొన్ని మార్పులు చేసింది. బుకింగ్ సులభతరం చేసేందుకు ఐఆర్సీటీసీ కొత్త మార్పు తీసుకొచ్చింది. ఫలితంగా టికెట్ పొందడంలో ఇబ్బందులు తలెత్తవు. రైల్వే టికెట్ బుకింగ్ విషయంలో ఐఆర్సీటీసీ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. ఈ మార్పుల్ని ప్రయాణీకులు తెలుసుకుంటే ఏ విధమైన అసౌకర్యం కలగదు.


తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు కుడివైపున్న క్లాక్ జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. లేకపోతే కన్ఫామ్ టికెట్ కష్టమౌతుంది. ఏసీ తత్కాల్ టికెట్ బుకింగ్ అనేది ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు ప్రారంభమౌతుంది. అదే స్లీపర్ టికెట్ బుకింగ్ 11 గంటలకు మొదలవుతుంది. తత్కాల్ టికెట్ బుకింగ్ సరైన సమయంలో చేస్తే ఏ సమస్యా ఉండదు. కన్ఫామ్ టికెట్ పొందేందుకు వీలుంటుంది. 


తత్కాల్ టికెట్ ఎలా బుక్ చేసుకోవడం


తత్కాల్ టికెట్ బుక్ చేసేముందుగా..ట్రావెల్ జాబితా సిద్ధం చేసుకోవాలి. ఫలితంగా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో మరోసారి పాసెంజర్ల వివరాలు నమోదు చేయకుండా ఉండవచ్చు. ఒకసారి ట్రావెల్ జాబితా సిద్ధమైన తరువాత దానిని సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. ఆ తరువాత బుకింగ్ ప్రారంభం కాగానే..కన్‌ఫామ్ బటన్ ప్రెస్ చేయాలి. ట్రావెల్ లిస్ట్ ఎంపిక చేసుకోగానే..పాసెంజర్ లిస్ట్ కన్పిస్తుంది. అదే సమయంలో పేమెంట్ ఆప్షన్ మీ ముందు కన్పిస్తుంది. యూపీఐ, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు.


Also read: Whatsapp New Features: వాట్సప్ నుంచి కొత్తగా మూడు ఫీచర్లు, ఇక మీ ప్రైవసీకు మరింత రక్షణ



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook