గత నెల రోజులుగా దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటుంది ప్రభాస్ సాహో. దాంతో దుబాయ్ లో ప్రభాస్ కి సంబంధించి చిన్న అప్ డేట్ వచ్చినా,  భారీ క్రేజ్ క్రియేట్ అవుతుంది. అందుకే హై డిమాండ్ లో ఉన్న ఈ ఇండియన్ యూనివర్సల్ స్టార్ ని స్పెషల్ గా ట్రీట్ చేస్తుంది దుబాయ్ మీడియా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా దుబాయ్ మీడియా  చేసిన ఇంటర్వ్యూ లో… అబూ దాబి లో తన ఎక్స్ పీరియన్సెస్ గురించి, ‘సాహో’ సినిమా గురించి చాలా విషయాలు చెప్పుకున్నాడు రెబల్ స్టార్.  అవి మీకోసం


ట్రీట్ మెంట్ మామూలుగా లేదు
దుబాయ్ లోని ‘టు ఫోర్ 54’ సంస్థ, ‘సాహో’ కి కావాల్సిన ప్రతి రిక్వైర్ మెంట్ ని దగ్గరుండి చూసుకుంటుంది. మాకు ఒక చోట షూట్ కి రోడ్డు కావాలని చెప్తే చాలు.. ట్రాఫిక్ నిలిపేస్తున్నారు. ఒక బిల్డింగ్ కావాలనుకుంటే చాలు ఇచ్చేస్తున్నారు.. చాలా కంఫర్ట్ గా షూట్ చేసుకుంటున్నాం


250 మందితో స్టంట్స్
యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో  కెన్నీబేట్స్ చాలా ప్లాన్డ్ గా, క్లారిటీతో ఉన్నాడు. ఏకంగా 250 మంది కేవలం ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసమే పని చేస్తున్నారు.  గత నెల రోజుల నుండి జస్ట్ ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కోసమే కంప్లీట్ క్రూ పని చేస్తున్నారు
 
రెండేళ్ళ క్రితమే
యాక్షన్ డైరెక్టర్ కెన్నీబైట్స్ 2 ఇయర్స్ బ్యాక్ దుబాయ్ కి వచ్చి ప్రతీది కన్ఫమ్ చేసుకున్నాడు. ఎందుకంటే తనకి ప్రతి యాక్షన్ లైవ్ కావాలి. బ్రిడ్జేస్, రోడ్స్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్రతీది పర్ఫెక్ట్ గా కావాలి. ఆయన విజన్ ప్రకారం దుబాయ్ పర్ఫెక్ట్ లొకేషన్.


నా లైఫ్ లో ఫస్ట్ టైమ్
ఇంత హెవీ అండ్ రియల్ స్టంట్స్ నా లైఫ్ లోనే ఫస్ట్ టైమ్ చూడటం.. చేయడం కూడా కళ్ళ ముందు పెద్ద పెద్ద ట్రక్స్, కార్స్ బ్లాస్ట్ అవుతుంటే చూస్తున్నా అమేజింగ్ ఎక్స్ పీరియన్స్.. రేపు సినిమా చూస్తున్న వాళ్లకు కూడా  రియల్ గా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.


అదీ లెక్క
ఇప్పటికే ఈ యాక్షన్ ఎపిసోడ్ లో 28 కార్లు, 5 ట్రక్కులు బ్లాస్ట్ చేశాము. అసలు ఆ సీన్స్ చూస్తుంటేనే అమేజింగ్ అనిపిస్తుంది. లాస్ట్ వీక్ చేసిన షూట్ లో నేను బైక్ రైడ్ చేశాను… సూపర్ ఫాస్ట్ స్పీడ్ లో… ఇక్కడ ప్రతీది చాలా ఎగ్జైటెడ్ గా ఉంది”


అవి సాహో స్టాండర్డ్స్
బాహుబలి సినిమా ఒక్కసారిగా నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ సినిమా తరవాత వస్తున్న సినిమా అనగానే డెఫ్ఫినేట్ గా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. అందుకే చేసేది ఎదైనా బిగ్గర్ గా ఉండాలి.. ప్రపంచంలోనే   బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకు అందించాలి.. సాహో కంప్లీట్ గా ఆ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతుంది.


నో కార్బోహైడ్రేట్స్
‘బాహుబలి’ సినిమా కోసం నేను 8 నుండి 9 కిలోల బరువు పెరిగాను. ఒక వారియర్ లుక్ కోసం అది అవసరం.. ఇక ‘సాహో’ కి అది అనవసరం… కొంచెం సన్నగా ఉంటేనే పర్ఫెక్ట్ లుక్. అందుకే కంప్లీట్ గా కార్బోహైడ్రేట్స్ లేని ఫుడ్ తీసుకుంటున్నాను
 
అవి కంపల్సరీ
ఇక్కడ షావార్మాస్ చాలా టేస్టీగా ఉన్నాయి… ఇక్కడ అవి కంపల్సరీ గా నా డైట్ లిస్టులో ఉంటాయి


అదొక్కటే ప్రాబ్లమ్
తెలుగు తమిళం ఓకె కానీ. హిందీ ఒకటే కొంచెం చాలెంజింగ్ గా ఉంది. నాకు హిందీ రాయడం వచ్చు. చదవడం కూడా వచ్చు కానీ కంప్లీట్ గా నా స్టైల్ లో పర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు, హిందీ ఆక్సెంట్ లో ఇంకా పర్ఫెక్షన్ రావాలి.


కానీ పెద్దగా ఇబ్బంది లేదు
సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో న్యాచురల్ గానే ఒక స్లాంగ్ ఉంటుంది. వేరే కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు డెఫ్ఫినేట్ ఆ స్లాంగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మరీ అంత కష్టమేం కాదు… నాకు చాలా హెల్ప్ దొరుకుతుంది కాబట్టి.. హిందీ నేర్చుకోవడంలో ఇబ్బందేం లేదు.


ఆ ముగ్గురి వల్ల ఇబ్బంది తగ్గింది
శ్రద్ధా కపూర్, నీల్ నితిన్ ముకేష్, జాకీ ష్రాఫ్.. ఈ ముగ్గురి వల్ల హిందీ నేర్చుకోవడం ఇంకాస్త ఈజీ అయిపోయింది.
 
శ్రద్ధా కపూర్ పాయింట్ ఆఫ్ వ్యూ

సినిమాలో ప్రతి ఒక్కరు చాలా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తారు. ‘సాహో’ కథే చాలా గొప్పది. శ్రద్ధా కపూర్ కూడా ఏదో జస్ట్ సాంగ్స్ కోసం వచ్చి వెళ్లడమో, జస్ట్ గ్లామర్ పోర్షన్ కోసం ఉండటమో కాకుండా చాలా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తుంది. ఒకరకంగా ‘సాహో’ సినిమా ఆ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నడుస్తుంది.


అలా నాకిష్టం లేదు
బాహుబలి తరవాత ఇప్పుడు సాహో… ఇంకా ప్రభాస్ కంప్లీట్ గా యాక్షన్ సినిమాలే చేస్తాడు.. మాచో రోల్స్ లోనే కనిపిస్తాడు అని అందరు అనుకుంటున్నారు కానీ అలా ఏం లేదు.. సాహో తరవాత నేను చేయబోయేది.. కంప్లీట్ ఇమోషనల్ లవ్ స్టోరి. యూరోప్ లో ఆ సినిమా షూట్ చేస్తాము.


నా ఫేవరేట్ సినిమాలు
‘షోలే’ సినిమా తరవాత నాకు అంతలా నచ్చిన సినిమా సల్మాన్ ఖాన్ దబాంగ్. స్టార్స్ డెఫ్ఫినేట్ గా సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్స్ కానీ, కథే ఫస్ట్ హీరో.. అది లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు
 
నా సినిమాల్లో కామన్ పాయింట్
నా నెక్స్ట్ సినిమాలో కూడా కథే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫ్యూచర్ లో కూడా ఏ సినిమా చేసినా బెస్ట్ స్టోరీలైన్ కామన్ పాయింట్ గా ఉంటుంది.


నాకంత సీన్లేదు
కొత్తగా సినిమాల్లోకి వస్తున్న యంగ్ స్టర్స్ కి నేనేం సలహా ఇవ్వలేను.. నాకింకా అంత సీన్లేదు…  నన్నీ స్థాయిలో నిలబెట్టింది డైరెక్టర్సే 


ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి
రాజమౌళి గారు చిన్న ఇంట్లో ఉంటారు… చిన్న కారు నడిపిస్తారు.. కానీ సినిమాలు పెద్ద పెద్దవి చేస్తారు.. ఒక స్క్రిప్ట్ ని ఎంత వైడ్ గా ప్రెజెంట్ చేయొచ్చో ఆయన దగ్గర నేర్చుకోవచ్చు…


జీవితాంతం మర్చిపోను
రాజమౌళి గారి దగ్గర జీవితానికి సరిపడా పాఠాలు నేర్చుకున్నాను…. ఆయన్ని లైఫ్ లాంగ్ మర్చిపోను


బిగినింగ్ లో భయపడ్డాను
నాకు దుబాయ్ రూల్స్ పెద్దగా తెలీదు… అందునా రంజాన్ లో షూటింగ్ అంటే ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అనుకున్నాను కానీ, కానీ ఇక్కడ మాకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు.


వ్యవసాయం చేసుకునే వాణ్ణి
నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఒకవేళ నేను యాక్టర్ ని అయి ఉండకపోతే డెఫ్ఫినేట్ గా వ్యవసాయం చేసుకునే వాణ్ణి.


బాలీవుడ్‌లో ఆయనే బెస్ట్
నా దృష్టిలో రాజు హిరాని బెస్ట్ & ట్యాలెంటెడ్ డైరెక్టర్.


నాకు నచ్చనిదదే
నాకు షాపింగ్ చేయడమంటే చెడ్డ చిరాకు… ఎంత పెద్ద షాపింగ్ మాల్ అయినా, ఎంత అవసరమున్నా గంట కన్నా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేను….


అవి రెండే చాలా ఇష్టం
వైట్ సాండ్ లో వాలీబాల్ ఆడటమన్నా, తలుపులన్నీ వేసేసుకుని హోమ్ థియేటర్ లో సినిమా చూడటమన్నా చాలా చాలా ఇష్టం.


(జీ సినిమాలు సౌజన్యంతో)