ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ అతడి అప్ కమింగ్ సినిమా ఇస్మార్ట్ శంకర్ టీజర్ విడుదలైంది. పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రామ్ లుక్ అతడి అభిమానుల‌ని ఆక‌ట్టుకునేలా విభిన్నంగా ఉంది. ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలు ఎన్నో చేసిన రామ్‌ను పూరి ఈ సినిమాలో ఇంకొంత విభిన్నంగా చూపించాడని అతడి గెటప్, డైలాగ్ డెలివరీ, హైదరాబాదీ యాసలో మాడ్యులేషన్ వంటివి చూస్తే అర్థమవుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేయగా పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్‌, చార్మీలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రామ్‌ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.