ITR Filing last Date: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేశారా..లేకపోతే వెంటనే చేయండి. ఇంకా వారం రోజులే గడువు మిగిలుంది. ఐటీఐర్ 1 లేదా సహజ్ ఫైలింగ్ కోసం సిద్ధం చేసుకోవల్సిన డాక్యుమెంట్లు ఇవే. లేకపోతే జరిమానా తప్పదు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021-22 ఆర్ధిక సంవత్సరం ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేసేందుకు మరో వారం రోజులే గడువుంది. చివరి క్షణంలో అవసరమైన డాక్యుమెంట్ల కోసం అటూ ఇటూ తిరగకుండా జాగ్రత్త పడండి. వేతన జీవులు ఐటీఆర్-1 లేదా సహజ్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా చెక్ లిస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఐటీఆర్ 1 ఫైలింగ్ కోసం మొత్తం 9 డాక్యుమెంట్లు అవసరమౌతాయి. ఆ వివరాలు మీ కోసం..


ఐటీఆర్ 1 ఫైలింగ్ కోసం కావల్సిన 9 డాక్యుమెంట్లు ఇవే


1. పాన్, ఆధార్ కార్డు వంటి సాధారణ సమాచారం
2. శాలరీ లేదా పెన్షన్ దారులకు ఫామ్ 16
3. హౌస్ ప్రోపర్టీ నుంచి ఆదాయానికి సంబంధించి అద్దె రసీదు, హౌసింగ్‌లోన్ స్టేట్‌‌మెంట్
4. ఇతర మార్గాలకు సంబంధించి బ్యాంక్ స్టేట్‌మెంట్, పాస్‌బుక్
5. ఛాప్టర్ 6ఏ కింద డిడక్షన్ కోసం పీఎఫ్ లేదా ఎన్ పీఎస్ చెల్లింపు, పిల్లల స్కూల్ ఫీజు, ఎల్ఐసీ రిసీప్ట్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్, సేవింగ్ లేదా మ్యూచ్యువల్ ఫండ్స్ వివరాలు, విరాళాలకు సంబంధించి 80జి
6. పెట్టుబడులు, డిపాజిట్లు, ఏప్రిల్ 2020 నుంచి జూలై 2023 వరకూ చెల్లింపుల వివరాలు
7. ట్యాక్స్ పేమెంట్ వివరాలు
8. టీడీఎస్ వివరాలు ఫామ్ 16, అద్దెదారుడి పాన్, ఆధార్ వివరాలు
9. ఇతర సమాచారం, వ్యవసాయ ఆదాయం,సెక్షన్ 89 ప్రకారం రిలీఫ్ కావలిస్తే ఫామ్ 10ఇ


2021-22 సంవత్సరపు ఇన్‌కంటాక్స్ రిటర్న్, 2022-23 సంవత్సరపు అసెస్‌మెంట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. జూలై 31 గడువు తేదీగా ఉంది. అంటే మరో వారం రోజులు మాత్రమే మిగిలుంది. ఈలోగా ఫైల్ చేయకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 


Also read: India Post Recruitment 2022: ఇండియాన్‌ పోస్టల్‌లో త్వరలోనే భారీ రిక్రూట్‌మెంట్.. ఇలా అప్లై చేసుకోండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.