Jatara Movie: ‘జాతర’ సినిమాకి నెట్టింట పాజిటీవ్ టాక్‌ లభించింది. ఈ సినిమాకు సతీష్ బాబు రాటకొండ దర్శకత్వంతో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా దీయా రాజ్‌ నటించారు. ఈ సినిమాకు రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ జాతర మూవీ అద్భుతమైన కానెసెప్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది చిత్తూరు జిల్లాల్లోని బ్యాక్‌ డ్రాప్‌ ఏరియాల్లో జరిగే జతరకు సంబంధించిన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రూపొందించిన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నవంబర్ 8వ తేదిన విడుదల కాబోతోంది. ఇదిలా ఉండడా ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను సోమవారం నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ జాతర సినిమాకు సంబంధించిన దర్శకుడు, హీరో సతీష్‌ బాబు మాట్లాడుతూ.. యథార్థ సంఘటనల ధృష్టిలో పెట్టుకుని ఈ కథను డెవలప్‌ చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ కథను నిర్మాతలకు చెప్పినప్పుడు వారు అద్భుతంగా నచ్చిన్నట్లు తెలిపారు. 2016 సంవత్సరంలో ఈ కథన ప్రారంభించి.. చిన్నచిన్నగా డెవలప్‌ చేస్తూ వచ్చాడని తెలిపారు. ఆ మధ్యంలో కరోనా రావడంతో ఇంకాస్త కూడా టైమ్‌ పట్టిందన్నారు. అంతేకాకుండా జాతర సమయంలో ఊరికి సంబంధించిన కట్టుబాట్లతో పాటు తంతు విషయాలను ఈ కథలో వివరించిన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాల్లో అన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయని సతీష్‌ బాబు వెల్లడించారు. అలాగే తనతో పని చేనిన అందరికీ థ్యాంక్స్‌ కూడా తెలియజేశారు. 


ఇక ఈ జాతర సినిమాపై తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..  ఈ సినిమా కానెసెప్ట్‌ చాలా అద్భుతంగా ఉంటుందని.. అలాగే ఇటీవలే కాలంలో మంచి కథలు ఉన్న సినిమాలను హీరో, డైరెక్టర్ల గురించి ఎవ్వరు పట్టించుకోరాని తెలిపారు. ఇటీవలే సతీష్‌ పరిచయమయ్యాడని హీరో, రైటర్‌గా తన వంతు సినిమాకు న్యాయం చేశాడని తెలిపారు. త్వరలోనే సతీష్ రిషభ్ శెట్టిలాగా పెద్ద హీరో కావాలని ఆశిస్తున్నానని తమ్మా రెడ్డి తెలిపారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ చాలా బాగా నచ్చిందని తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలై, హిట్టు కోట్టాలని అన్నారు. 


Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  


ఇక ఈ సినిమాపై శివ బాలాజీ మాట్లాడుతూ.. ‘జాతర ట్రైలర్‌ను విడుదల చేసిన వెంటేనే చూశానని.. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా.. అనేక అద్భుతమైన పాయింట్స్‌తో ఉందని ఆయన తెలిపారు. హీరో, దర్శకుడు సతీష్ బాబుకు త్వరతోనే మంచి పేరు కూడా వస్తుందని, ఆల్ ది బెస్ట్ కూడా తెలిపారు.. ఈ సినిమా మంచి హిట్‌ సాధించి.. నిర్మాతలకు లాభాలు రావాలని కోరుకుంటున్న అని తెలిపారు. అలాగే హీరోకి ఆల్‌ ది బెస్ట్‌ కూడా అన్నారు.


Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.