Kangana Ranaut on Sushant`s suicide: సుశాంత్‌ది సూసైడ్ కాదు.. పక్కా మర్డర్
Kangana Ranaut slams Bollywood | సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ తీరుపై కంగనా రనౌత్ పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ మృతిపై మీడియా స్పందించిన తీరుపైనా కంగనా తీవ్రంగా మండిపడింది. `సెలబ్రిటీలు వ్యక్తిగత ఇబ్బందులు, మానసిక సమస్యలతో బాధపడుతుంటే, మీడియా వాళ్లు వీలైతే వారికి మద్దతు ఇవ్వాలే కానీ ఇంకా ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించకూడదని మీడియాకు హితవు పలికింది.
Kangana Ranaut slams Bollywood | సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ (Bollywood) తీరుపై కంగనా రనౌత్ పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ మృతిపై మీడియా స్పందించిన తీరుపైనా కంగనా తీవ్రంగా మండిపడింది. "సెలబ్రిటీలు వ్యక్తిగత ఇబ్బందులు, మానసిక సమస్యలతో బాధపడుతుంటే, మీడియా వాళ్లు వీలైతే వారికి మద్దతు ఇవ్వాలే కానీ ఇంకా ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించకూడదని మీడియాకు హితవు పలికింది. ( సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య )
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలహీనమైన మనస్తత్వం గలవాడని.. అందుకే ఒత్తిళ్లను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడని అతడి గురించి కొన్ని మీడియా సంస్థలు రాసిన కథనాలను తీవ్రంగా ఖండించిన కంగనా రనౌత్.. సుశాంత్ చదువుకునే రోజుల్లో ర్యాంక్ హోల్డర్ అని.. అతడికి వీక్ మైండ్ ఎలా ఉంటుందని నిలదీసింది. సుశాంత్‌కి అడిక్షన్ ఉందని రాసిన వాళ్లూ ఉన్నారని.. వాళ్లకు సంజయ్ దత్ అడిక్షన్ మాత్రం చాలా క్యూట్‌గా ఉంటుంది కదా అని ఎద్దేవా చేశారామె ( Kangana Ranaut on Sanjay dutt). తనకు సినీపరిశ్రమలో బ్యాగ్రౌండ్ లేదని, పరిశ్రమలో తనకు గాడ్ ఫాదర్స్ లేనందున తన సినిమాలు చూసి తనను ఆదరించాల్సిందిగా సుశాంత్ వేడుకుంటున్నట్టుగా గతంలో వైరల్ అయిన ఓ సోషల్ మీడియా పోస్టు గురించి కంగనా రనౌత్ గుర్తుచేస్తూ.. సుశాంత్ ఎన్ని గొప్ప సినిమాలు చేసినా.. అతడికి సరైన ఆధరణ లభించలేదని కంగనా వ్యాఖ్యానించింది. సినీ ప్రముఖుల పిల్లలకు వచ్చినట్టుగా సుశాంత్‌ని ప్రోత్సహించేట్టు అవార్డులు ఏవీ రాకపోవడం బాధాకరం అని కంగనా రనౌత్ బాలీవుడ్ తీరును నిక్కచ్చిగానే ఎండగట్టింది. ( వైరల్‌గా మారిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి INSTAGRAM POST )
ఈ సందర్భంగా కొంతమంది తనకు పంపిస్తున్న సందేశాలను కూడా కంగనా రనౌత్ ఇక్కడ గుర్తుచేసుకున్నారు. తాను కూడా తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నానని.. ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ పలువురు సందేశాలు పంపిస్తున్నారని చెప్పిన కంగనా రనౌత్.. తాను ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలను ( Suicidal thoughts) తన బుర్రలోకి ఎందుకు చొప్పిస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కష్టాల్లో ఉన్నప్పుడు అతడికి ఎవ్వరూ అండగా నిలవలేదని.. అందుకే ఇది సూసైడ్ కాదు.. పథకం ప్రకారం జరిగిన మర్డర్ అంటూ బాలీవుడ్ పరిశ్రమ తీరుపై కంగనా రనౌత్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కంగనా రనౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..