Man kisses 15 Feet King Cobra: పామును చూస్తేనే ప్రతిఒక్కరు పరుగు అందుకుంటారు. అలాంటిది అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా కనిపిస్తే ఇంకేమైనా ఉందా?.. వెనక్కి తిరగకుండా అక్కడినుంచి పారిపోతారు. అలాంటి కొంత మంది చాలా ధైర్యం చేసి పాములను పట్టుకొని అడవుల్లో వదిలేస్తుంటారు. స్నేక్ క్యాచర్స్ మాత్రమే కింగ్ కోబ్రాలను పట్టుకుంటారు. అయితే ఓ వక్తి పెద్ద సాహసం చేశాడు. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను కిస్ చేశాడు. అవును నిజమే థాయిలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి పడగ విప్పిన కింగ్ కోబ్రా నుదిటిపై ముద్దుపెట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

థాయిలాండ్‌లోని ఫుకెట్ నగరంలో గత మే నెలలో ఓ స్నేక్ షో జరిగింది. ఆ షోలో ఓ వక్తి 16 అడుగుల కింగ్ కోబ్రాను బాక్స్ నుంచి బయటకు తీసి రింగ్‌లో వేస్తాడు. ఆపై ఆ వ్యక్తి కింగ్ కోబ్రాను ముట్టుకోగానే.. ఒక్కసారిగా అది పడగ విప్పి అతడిని కాటేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి తృటిలో కాటు నుంచి తప్పించుకుంటాడు. అనంతరం కింగ్ కోబ్రా దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించగా.. అది వెనక్కి వెళ్లి మరీ అతడిని దాడి చేస్తుంది. కాసేపటికి ఆ వ్యక్తి చేతితో టచ్ చేయడానికి ప్రయత్నించగా.. అది బుసలు కొడుతూ ముందుకు దూసుకొస్తుంది. 



చాలా ప్రయత్నాల అనంతరం కింగ్ కోబ్రాను ఆ వ్యక్తి చేతిలో తాకుతాడు. అప్పుడు అది ఏమనదుకొద్దిసమయం తర్వాత ఆ వ్యక్తి నెమ్మదిగా కింగ్ కోబ్రాను బుజ్జగించి.. దాని పడగపై కిస్ చేస్తాడు. ఆపై మరోసారి కూడా ముద్దు పెడతాడు. వ్యక్తి తన కళ్లతో పామును తన ఆధీనంలోకి తెచ్చుకుని కిస్ చేస్తాడు. దాంతో అందరూ చప్పట్లతో అతడిని అభినందిస్తారు. ఇందుకు సంబందించిన వీడియోను 'DangerWoods' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేస్తారు. ఈ వీడియో ఆరు నెలల క్రితందే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. వీడియో చూసిన అందరూ షాక్ అవుతున్నారు. 


Also Read: కోడి పిల్లను చూసి.. బొక్కబోర్లా పడ్డ భారీ కొండచిలువ! నమ్ముకుంటే వీడియో చూడండి


Also Read: Rhino In Football Ground: ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook