Liger - Vijay Devarakonda : లైగర్ సినిమా ఇటు విజయ్ దేవరకొండ కెరీర్‌లో అటు పూరి జగన్నాథ్ కెరీర్‌లో మాయని మచ్చలా, మరిచిపోలేని దెబ్బలా మిగిలిపోయింది. లైగర్ సినిమాతో పాన్ ఇండియన్ రేంజ్‌లో నిలబడదామని విజయ్ అనుకున్నాడు. దానికి తగ్గట్టుగా తనని తాను మార్చుకున్నాడు. శరీరాన్ని కష్టపెట్టాడు. ఫిట్నెస్ మెయింటైన్ చేశాడు. ఇక పూరి జగన్నాథ్ కూడా మరోసారి తన సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నించాడు. అయితే తమ సినిమా మీద తమకు అతి నమ్మకం ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో సినిమా గురించి మరీ ఎక్కువ చేసి చెప్పారు. ప్రమోషన్స్‌లో విజయ్, ఛార్మీ, పూరి మాటలు ఆకాశన్నంటితే.. సినిమా మాత్రం నేరబారులో కూడా లేకపోయింది. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా కొత్తగా లేకపోవడం, అవుట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో విసిగించేశాడు పూరి. కనీసం విజయ్ నటన అయినా బాగుంటుందని అనుకుంటే.. నత్తి పెట్టి నాశనం చేసేశారు. విజయ్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలు కూడా కొంత నష్టం చేశాయి.


తమ సినిమాకు మినిమం రెండొందల కోట్లు వస్తాయని, అక్కడి నుంచే తాను లెక్కిస్తాను అని ఇలా ఓవర్‌గా మాట్లాడాడు. దీంతో మొదటికే మోసం వచ్చింది. సినిమా దారుణాతి దారుణంగా దెబ్బ కొట్టేసింది.అయితే సినిమాకు ముందు విజయ్, ఛార్మీ, పూరీలు ఒకరిపై ఒకరు చాలానే ప్రశంసలు కురిపించుకున్నారు. ఆకాశానికెత్తేసుకున్నారు. విజయ్ నిజంగానే బంగారు కొండ.. రెమ్యూనరేషన్ కూడా అడగలేదు.. డబ్బులిస్తే.. తిరిగి పంపించేశాడు.. మీరు అప్పుల్లో ఉన్నారు కదా? వాటిని తీర్చేసుకోండని అన్నాడని విజయ్ గురించి ఎంతో గొప్పగా చెప్పింది ఛార్మీ.


కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులన్నీ మారిపోయినట్టు తెలుస్తోంది. లైగర్ ఫ్లాప్ అవ్వడంతో సంబంధాలన్నీ తెగిపోయినట్టు కనిపిస్తున్నాయి. అందుకే జనగణమన సినిమాను కూడా పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. ఇక విజయ్ మేనేజర్ ఫోన్ చేస్తుంటే ఛార్మీ గానీ పూరి గానీ రెస్పాండ్ అవ్వడం లేదని టాక్. ఫోన్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయడం లేదని విజయ్ హర్ట్ అయ్యాడని తెలుస్తోంది.


Also Read : Samantha Face Surgery : సమంత మొహానికి ప్లాస్టిక్ సర్జరీ?.. ఆ ఫోటోలతోనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయా?


Also Read : Bigg Boss Geetu : ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది.. గలాట గీతూ ఇక మారదా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి