Macherla Niyojakavargam: అమెరికా ప్రీమియర్ షోలన్నీ రద్దు.. అసలు ఏమైందంటే?
Macherla Niyojakavargam US Shows Cancelled: హీరో నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. పలు టెక్నికల్ కారణాలతో అమెరికాలో సినిమా షోస్ రద్దయినట్లు తెలుస్తోంది.
Macherla Niyojakavargam US Shows Cancelled: హీరో నితిన్ హిట్ అందుకుని చాలా కాలమే అయింది. చివరిగా భీష్మ సినిమాతో హిట్టు అందుకున్న నితిన్ ఆ తర్వాత సరైన హిట్టు అందుకోలేదు. ప్రస్తుతం ఆయన మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. నిజానికి ఈపాటికి అమెరికాలో షోస్ పడి ఉండాలి. కానీ పలు టెక్నికల్ కారణాలతో సినిమా షోస్ రద్దయినట్లు తెలుస్తోంది. దీంతో ట్విట్టర్ రివ్యూలు కూడా బయటకు రాలేదు.
అయితే సాధారణంగా సినిమాలు ప్లే అవ్వాలంటే కీ డెలివరీ మెసేజ్ అనే ఒక పాస్వర్డ్ ఉండాల్సి ఉంటుంది. కానీ అవి రాకపోవడంతోని అమెరికాలో షోలు రద్దు అయినట్లు తెలుస్తోంది. మొదటి షో భారత కాలమానం ప్రకారం 6:30 గంటలకు అమెరికాలో ప్రారంభం కాబోతోంది. దాని కంటే ముందు వచ్చే ఏ రివ్యూ అయినా ఫేక్ అంటూ నితిన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో క్లారిటీ ఇస్తున్నారు. ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు.
ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తిస్థాయి పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో నితిన్ సిద్ధార్థ రెడ్డి అనే ఒక ఐఏఎస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ పాత్రలో ఆయన కనిపించబోతున్నాడు. ఈ సినిమాను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నితిన్ సోదరి నిఖితారెడ్డి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు. ఈ సినిమాలో సముద్రఖని విలన్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా ట్రైలర్, టీజర్ సహా ప్రమోషనల్ స్టఫ్ అంతా సినిమా మీద అంచనాలు పెంచాయి.
మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకోబోతోంది అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇక ఈ సినిమా మీద నితిన్ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున జరిపించారు. అయితే దర్శకుడు గతంలో కొన్ని కులాలను టార్గెట్ చేస్తూ కామెంట్ చేశాడంటూ కొన్ని ట్వీట్లు తెర మీదకు వచ్చిన నేపథ్యంలో అది సినిమాకి కొంత మైనస్ అయ్యే అవకాశాలు లేకపోలేదని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎంతవరకు నితిన్ కి కలిసి వస్తుంది అనేది.
Also Read: Kushita Kallapu: రవితేజ కంట్లో పడి హీరోయిన్ గా మారిన బజ్జీల పాప!
Also Read: Actress Hema: సురేఖ ఓర్వలేకపోయింది.. నా గురించి ఆ మాటలు కూడా.. ఆరోపణలు గుప్పించిన హేమ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.